నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీ..
గురువారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీని అందుకుంది. సెకెండ్ హాఫ్‌లో నైట్ రైడర్స్‌కు ఇది రెండో విజయం. ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. పాయింట్ల పట్టికలో ఎకాఎకిన నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ రెండు వరుస గెలుపులు కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్ రేసులో నిల్చోపెట్టాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా మార్చివేసింది. తొమ్మిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకుంది మోర్గాన్ టీమ్.
తొలుత బౌలింగ్‌లో..
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది కోల్‌కత నైట్ రైడర్స్. బౌలింగ్‌లో సత్తా చాటింది. ఆల్‌రౌండర్లతో నిండివున్న ముంబై ఇండియన్స్‌ను 155 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ మినహా ఆ జట్టులో మరెవరూ రాణించలేకపోయారు. రోహిత్ 30 బంతుల్లో 33 పరుగులు, డికాక్ 42 బంతుల్లో 55 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ గానీ, మిడిలార్డర్ గానీ బ్యాటింగ్‌లో ప్రతాపాన్ని చూపలేకపోయింది. ఫలితంగా-155 పరుగులే చేయగలిగింది.
15 ఓవర్లలోనే
అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది నైట్ రైడర్స్. శుభ్‌మన్ గిల్ త్వరగా అవుట్ అయినా.. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠితో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వెంకటేష్ అయ్యర్- 30 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 53 పరుగులు, త్రిపాఠి- 42 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 74 పరుగులు చేశారు. తమ జట్టుకు సునాయాస గెలుపు అందించారు.
15 ఓవర్లలోనే
అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది నైట్ రైడర్స్. శుభ్‌మన్ గిల్ త్వరగా అవుట్ అయినా.. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠితో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వెంకటేష్ అయ్యర్- 30 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 53 పరుగులు, త్రిపాఠి- 42 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 74 పరుగులు చేశారు. తమ జట్టుకు సునాయాస గెలుపు అందించారు.
ఆరో స్థానానికి
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత దిగజార్చుకుంది. ఎమిరేట్స్‌లో సెకెండ్ హాఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందు నాలుగో స్థానంలో కనిపించింది రోహిత్ సేన. ఇప్పుడా స్థానాన్ని కోల్పోయింది. నాలుగో స్థానంలోకి కోల్‌కత నైట్ రైడర్స్ వచ్చి చేరింది. ఆరో స్థానానికి దిగజారింది ముంబై ఇండియన్స్. తొమ్మిది మ్యాచుల్లో అయిదు ఓటములను చవి చూసిందా టీమ్. తన తదుపరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది.
అచ్చొచ్చిన అరబ్ గడ్డపైనా
నిజానికి- టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్. ఆ స్థాయిలో ఆడట్లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే గత ఏడాది ముగిసిన ఐపీఎల్ 2020లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది రోహిత్ టీమ్. గత ఏడాది టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా అలాంటి అంచనాలతోనే ఈ సీజన్‌ను ఆరంభించినప్పటికీ- పరాజయాలను చవి చూస్తూ వస్తోంది. అచ్చొచ్చిన గడ్డపై రెండు మ్యాచ్‌లను ఆడినా సానుకూల ఫలితం రాలేదు. ఇంకా బోణీ కొట్టనే లేదు. ప్లే ఆఫ్ చేరాలంటే ఆడే అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
భిన్నంగా కేకేఆర్..
కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితి.. ముంబై ఇండియన్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటోంది. సెకెండ్ హాఫ్ ఆరంభం అయ్యే సమయానికి ఆ జట్టు ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లే. ఆరో స్థానంలో కొనసాగిందా జట్టు. భారత్‌లో జరిగిన మ్యాచుల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది మోర్గాన్ టీమ్. వరుస పరాజయాలను చవి చూసింది. అయిదు మ్యాచుల్లో ఓడిపోయింది. ఎమిరేట్స్ గడ్డపై మాత్రం తిరుగులేని విజయాలను అందుకుంటోంది. వరుసగా రెండింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి రైడ్ చేసింది.


Click it and Unblock the Notifications












