బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో అతనికి ఏ+ గ్రేడ్ ఇవ్వకపోవడం అన్యాయం: మాజీ క్రికెటర్లు

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019-2020 కాంట్రాక్ట్‌ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు కొనసాగనుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ 'ఎ' ప్లస్‌'లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్ల చొప్పున వేతనం అందనుంది. అయితే ఈ ఏ+ గ్రేడ్ జాబితాలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటివ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను మూడు ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శన కబర్చడంతో పాటు ఐసీసీ ర్యాంకుల్లో మంచి స్థానంలో ఉన్నాడని, అలాంటి ప్లేయర్‌కు ప్రమోషన్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు.

ఇది అన్యాయం..

ఇది అన్యాయం..

ఇక రవీంద్ర జడేజాకు ఏ కేటగిరి జాబితాలో ఉండగా అతనికి రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అయితే రవీంద్ర జడేజాకు ఏ+ కేటగిరి ఇచ్చేందుకు అన్ని అర్హతలున్నాయని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.‘ఏ+ కేటగిరి కాంట్రాక్ట్‌కు జడేజా సరైనవాడు. మూడు ఫార్మాట్లలో మెరుగ్గా రాణిస్తూ మంచి ఐసీసీ ర్యాంకులు ఉన్న ఆటగాళ్లకు ఆ జాబితాలో చోటు దక్కుతుంది. ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం గల కారణం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

త్వరలో పంత్ కూడా..

త్వరలో పంత్ కూడా..

ఇక యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అతి త్వరలోనే ఈ ఏ+ గ్రేడ్‌లో చోటు దక్కించుకుంటాడని ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ జోస్యం చెప్పాడు. ‘అతి త్వరలోనే రిషభ్ పంత్ ఏ+ కేటగిరిలో ఉంటాడు. ప్రస్తుతం అతను రెగ్యూలర్‌గా ఆడకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఈ కేటగిరి నుంచి అతన్ని పక్కనపెట్టడం చాలా కష్టం అవుతుంది. పంత్‌తో పాటు జడేజా కూడా ఈ టాప్ కేటగిరిలో చోటు దక్కించుకుంటాడు.'అని ఎమెస్కే తెలిపాడు. ప్రస్తుతం పంత్ కూడా గ్రేడ్-ఎ కేటగిరి కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్నాడు. అతను కూడా ఏడాదికి రూ.5 కోట్ల వేతనం అందుకోనున్నాడు.

జడేజాకు అవమానం..

జడేజాకు అవమానం..

మూడు ఫార్మాట్లలో తనదైన పెర్ఫామెన్స్‌తో రాణిస్తున్న రవీంద్ర జడేజాకు ఏ+ కాంట్రాక్టు ఇవ్వకపోవడం విస్మయపరిచిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. ట్విటర్ వేదికగా బీసీసీఐ కాంట్రాక్టులపై స్పందించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. ఏ+ కేటగిరి‌లో చోటివ్వకపోవడం జడేజాను అవమానపర్చడేమనని పేర్కొన్నాడు. అయితే రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావించి చివర్లో వెనకడుగు వేసిందని క్రిక్‌బజ్ పేర్కొంది. ఇటీవల అతను ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతోనే అతనికి ఏ+ గ్రేడ్ దక్కలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో బిజీగా ఉన్న జడేజా.. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో తన మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. విధ్వంసకర కేఎల్ రాహుల్, గ్రిస్ గేల్‌‌లను తన సూపర్ ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో సీఎస్‌కే ఈ సీజన్‌లో బోణీ కొట్టింది.

మియా భాయ్‌కి చాన్స్..

మియా భాయ్‌కి చాన్స్..

బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్, పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్‌ ‘సి' లో చోటు కల్పించారు. దాంతో వీరికి రూ. కోటి చొప్పు న వార్షిక వేతనం లభిస్తుంది. 2017-2018 తర్వాత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (గుజరాత్‌) మళ్లీ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్‌ పటేల్‌కు గ్రేడ్‌ ‘సి'లో స్థానం ఇచ్చారు. గాయాల బారిన పడ్డ భువనేశ్వర్‌ కుమార్‌ గ్రేడ్‌ ‘ఎ' నుంచి ‘బి'కి పడిపోయాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు గ్రేడ్‌ ‘బి' నుంచి ‘ఎ'కు... పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు గ్రేడ్‌ ‘సి' నుంచి ‘బి'కి ప్రమోషన్‌ లభించింది. గత ఏడాది గ్రేడ్‌ ‘సి' కాంట్రాక్ట్‌ పొందిన కేదార్‌ జాదవ్‌ (మహారాష్ట్ర), మనీశ్‌ పాండే (కర్ణాటక) ఈసారి మొండిచేయి లభించింది. వీరిద్దరూ తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, April 17, 2021, 15:17 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X