కీలక సమయాల్లో చేసిన తప్పిదాలే మా కొంపముంచాయి: ధోనీ

IPL 2021: MS Dhoni After CSK Loss VS MI జడేజా, అలీ కి లాస్ట్ ఓవర్ ఇవ్వాల్సింది..!! | Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రణాళికలను పకడ్బందీగా అమలు పర్చలేకపోవడం, కీలక సమయంలో క్యాచ్‌లు నేలపాలు చేయడమే తమ ఓటమికి కారణమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఓటమి పాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన ధోనీ.. ఆఖరి బంతికి ఓడటం నిరాశకు గురిచేసిందన్నాడు. వికెట్ అద్భుతంగా ఉందని, కానీ ఇరు జట్ల మధ్య ఉన్న తేడా ప్రణాళికలను అమలు పర్చడమేనని తెలిపాడు. ఈ విషయంలో ముంబై పై చేయి సాధించి విజయాన్నందుకుందని చెప్పాడు.

క్యాచ్‌లు నేలపాలు చేశాం...

క్యాచ్‌లు నేలపాలు చేశాం...

‘నా అభిప్రాయం ప్రకారం ఇదో బ్రిలియంట్ వికెట్. అయితే ఇరు జట్ల మధ్య ఉన్న తేడా మాత్రం ప్రణాళికలను అమలుపర్చడమే. ఈ విషయంలో ముంబై పైచేయి సాధించి విజయాన్నందుకుంది. ఫీల్డర్ల క్యాచ్‌ల సహకారం లేకుండా బౌలర్లు రాణించడం చాలా కష్టం. కీలక సమయంలో క్యాచ్‌లు నేలపాలు చేశాం. టేబుల్ టాపర్‌గా ఓడిపోయామనే బాధలేదు. పటిష్ట బ్యాటింగ్ లైనప్, బిగ్ హిట్టర్స్ ఉన్న జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాం. కానీ ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేయలేకపోయాం.

ఆఖరి బంతికి ఓడటం..

ఆఖరి బంతికి ఓడటం..

ఆఖరి ఓవర్‌లో ఒకటి, రెండు సిక్స్‌లు కొడితేనే గెలిచే పరిస్థితుల్లో కూడా ఓటమికి తలవంచడం బాధగా ఉంది. కానీ ఇలాంటి ఓటములతోనే ఎక్కువ నేర్చుకుంటాం. పాయింట్స్ టేబుల్లో ఎక్కడా ఉన్నామనే విషయం మాకు అనవసరం. ప్రతీ గేమ్ గెలవడం మాకు ముఖ్యమే. అలా ఆడితే ఆ ఫలితాలే మమ్మల్ని టేబుల్లో మెరుగైన స్థానంలో నిలబెడుతాయి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 18 ఓవర్‌లో ముంబై మ్యాచ్ విన్నర్ కీరన్ పొలార్డ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఫాఫ్ డూప్లెసిస్ నేలపాలు చేశాడు. ఈ తప్పిదమే మ్యాచ్ ఫలితాన్ని శాసించింది.

30 సిక్స్‌లు..30 ఫోర్లు..

30 సిక్స్‌లు..30 ఫోర్లు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 రన్స్ చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), మోయిన్ అలీ(36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) ధాటిగా ఆడారు. పొలార్డ్ (2/12) వికెట్లతో రాణించాడు. అనంతరం ముంబై కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) వీరోచితన పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్స్‌లు, 30 ఫోర్లు నమోదయ్యాయి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక చేజింగ్ స్కోర్.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 2, 2021, 6:15 [IST]
Other articles published on May 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X