CSK vs RR: నెమ్మదిగా ఆడటం జట్టుకు నష్టం కలిగిస్తుంది.. 40 ఏళ్ల వ‌య‌సులో బాగా ఆడ‌తాన‌ని హామీ ఇవ్వ‌లేను: ధోనీ

IPL 2021 : Can’t Guarantee Performances When I'am 40 - MS Dhoni || Oneindia Telugu

ముంబై: 40 ఏళ్ల వ‌య‌సులో ఇంకా నేను బాగా ఆడ‌తాన‌ని హామీ ఇవ్వ‌లేనని చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. ఫిట్‌గా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తానని, తన దృష్టి అంతా గేమ్‌పై ఫోకస్‌ చేయడంపైనే ఉంటుందని మహీ చెప్పాడు. సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. 6 బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ధోనీ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు బాదినప్పటికీ లయను అందుకోవడానికి మాత్రం ఇబ్బంది పడ్డాడు.

40 ఏళ్ల వ‌య‌సులో హామీ ఇవ్వ‌లేను

40 ఏళ్ల వ‌య‌సులో హామీ ఇవ్వ‌లేను

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'నేను నెమ్మదిగా ఆడటం చెన్నైకి నష్టం కలిగిస్తుంది. దీనికి అంగీకరిస్తున్నా. అయితే ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తానని హామీ ఇవ్వలేను. ఈ మ్యాచ్‌లో నేను ఆడిన మొదటి ఆరు బంతులు వేరే మ్యాచులో ఉపయోగపడతాయి. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఆన్‌ఫిట్‌ అని ఏ ఒక్కరూ అనరు. ఇది నిజం. ప్రదర్శన అనేది హామీ ఇవ్వలేని అంశం. నా 24 ఏళ్ల వయసులోనూ బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఇప్పుడు కూడా హామీ ఇవ్వలేను' అని అన్నాడు.

యువ ఆట‌గాళ్ల‌తో పోటీ ప‌డ‌తా

యువ ఆట‌గాళ్ల‌తో పోటీ ప‌డ‌తా

'ఫిట్‌గా ఉండ‌టానికి మాత్రం ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తా. ఈ విష‌యంలో టీమ్‌లోని యువ ఆట‌గాళ్ల‌తో పోటీ ప‌డ‌తాను. ఫిట్‌నెస్ విష‌యంలో మాత్రం నావైపు ఎవ‌రూ వేలెత్తి చూప‌కుండా చూసుకుంటాను' అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పాడు. ఈ మ్యాచులో చేతన్‌ సకారియా వేసిన 18వ ఓవర్‌లో కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి మహీ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టుకు క‌లిసొచ్చే విష‌యాలు చాలానే ఉన్నా.. మహీ ఫామ్‌ మాత్రం ఆందోళ‌న క‌లిగించింది. తొలి మ్యాచ్‌లో డ‌కౌటైన ధోనీ.. ఈ మ్యాచ్‌లో 17 బంతుల్లో 18 ప‌రుగులు చేశాడు.

గేమ్‌పై ఫోకస్‌ చేయడంపైనే

గేమ్‌పై ఫోకస్‌ చేయడంపైనే

ఫీల్డింగ్‌ వ్యూహాలకు పదును పెడుతూ పదే పదే బౌలర్లను మార్చిన ప్రయోగాలపై అడిగిన ప్రశ్నకు మహీ బదులిస్తూ... 'నేను ఎప్పుడూ ఏ సమయంలో ఏది మంచి అనిపిస్తే దాని కోసమే ప్రయత్నిస్తా. ఎప్పూడూ నా దృష్టి అంతా గేమ్‌పై ఫోకస్‌ చేయడంపైనే ఉంటుంది. ఏది మంచి అనిపిస్తే అది చేస్తా. మా పేసర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఇదే గేమ్‌లో ముఖ్యం. సామ్‌ కరన్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. బట్లర్‌ రివర్స్‌ షాట్‌ ఆడతాడనే విషయం నా మైండ్‌లో లేదు. ఆరో బౌలర్‌ ఆప్షన్‌ ఉండటం ఎప్పుడూ జట్టుకు మంచిదే. అది ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది' అని చెప్పాడు.

కెప్టెన్‌గా 200వ మ్యాచ్

కెప్టెన్‌గా 200వ మ్యాచ్

'ఈసారి ఇక్కడ (వాంఖడే) మంచు ప్రభావం పెద్దగా కనిపించలేదు. మేము ఇంకా స్కోరు చేస్తామనుకున్నాం. బోర్డుపై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలనుకున్నాం. మా క్యాంప్‌లో వాతావరణం బాగుంది. గత ఏడాది నేర్చుకున్న పాఠాలతో మా బౌలర్లు ఈ వికెట్‌పై బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఏ ఒక్కరూ వెళిత్తిచూపరు' అని చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో మహీకి కెప్టెన్‌గా ఇది 200వ మ్యాచ్. కెప్టెన్‌గా 1, 100, 200 మ్యాచులలో విజయాలు సాధించడం విశేషం.

‌చాహర్ పిలక హెయిర్ స్టైల్‌కు రీజన్ దొరికింది: జుట్టు గుట్టు బట్టబయలు: గర్ల్‌ఫ్రెండ్ ప్రయోగం

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 20, 2021, 15:12 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X