For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: చెన్నై వరుస విజయాలకు అసలు కారణం ఏంటో చెప్పిన ధోనీ!!

IPL 2021: MS Dhoni revels how Chennai Super Kings team change from last season

ఢిల్లీ: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలా ఎలా మారిపోయిందో తానకు అర్థం కాలేదన్నాడు. చెన్నై వరుస విజయాలపై మహీ ఆనందం వ్యక్తం చేశాడు. గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే.. ఈసారి జట్టు విజయాలకు అసలు కారణం అని తెలిపాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావారణం ఆరోగ్యకరంగా ఉండటం అనేది చాలా ముఖ్యమని ధోనీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శనతో చెన్నై పట్టికలో 7వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.

 ఇలా ఎలా మారిపోయిందో:

ఇలా ఎలా మారిపోయిందో:

మ్యాచ్ అనంతరం చెన్నై సారథి ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'మా బ్యాటింగ్‌ చాలా బాగుంది. అలా అని బౌలింగ్‌ బాలేదని కాదు. రెండు విభాగాల్లోనూ ఆకట్టుకున్నాం. అయితే ఢిల్లీ వికెట్‌ మాత్రం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కాలేదు. మేము ఢిల్లీ వచ్చినప్పుడు ఈ వికెట్‌ ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు. ఏదేమైనా వికెట్‌మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మంచు లేదు. ఇది చాలా మంచి విషయం. మంచు లేకపోతే 170 పరుగులు మంచి స్కోరే. మా ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫాఫ్ డుప్లెసిస్‌ మంచి భాగస్వామ్యం అందించడంతో మాకు టార్గెట్‌ పెద్ద కష్టంగా అనిపించలేదు' అని అన్నాడు.

గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే:

గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే:

'వరుస విజయాలకు కారణం గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే. బాగా ఆడితే తుది జట్టు కూర్పుపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఆడకపోతే ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. మేము సుమారు 5-6 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగానే ఉన్నాం. ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది. సొంతంగా ప్రాక్టీస్‌ అనేది కూడా చేయలేం. సుదీర్ఘ కాలంగా క్వారంటైన్‌లో ఉండటం, మరికొన్ని విషయాలు ప్రాక్టీస్‌ను దూరం చేశాయి. మా ఆటగాళ్లంతా ఈ సీజన్‌లో మరింత బాధ్యతను తీసుకున్నారు. గత 8-10 సంవత్సరాల నుంచి మా జట్టులో భారీ మార్పులు లేవు. దాంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలు వారికే అర్థమవుతాయి' అని మహీ పేర్కొన్నాడు.

అందరికి అవకాశం రావడం లేదు:

అందరికి అవకాశం రావడం లేదు:

'చెన్నై టీంలోని చాలా మంది ఆటగాళ్లకు తుది జట్టులో ఆడేందుకు ఎక్కువ అవకాశం రావడం లేదు. వారిని అభినందించక తప్పదు. అవసరాన్ని బట్టి ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావారణం ఆరోగ్యకరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే అది అంత సులభం కాదు. టాప్‌ లెవల్‌లో ఉన్నప్పుడు ఆడటానికి స్వేచ్ఛ దొరకుతుంది. మరిన్ని విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నాం' అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.

సీఎస్‌కే సునాయాస విజయం:

సీఎస్‌కే సునాయాస విజయం:

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వార్నర్‌ (57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధ శతకాలు చేశారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్‌ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) దుమ్మురేపారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 78 బంతుల్లోనే 129 పరుగులు జోడించడంతో సీఎస్‌కే సునాయాస విజయం అందుకుంది.

Story first published: Thursday, April 29, 2021, 11:26 [IST]
Other articles published on Apr 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+