అందుకే డ్వేన్ బ్రావో‌ను పక్కనపెట్టాం: ధోనీ

అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కోల్‌‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా మంచి ఫామ్‌లో ఉన్న డ్వేన్ బ్రావోను చెన్నై పక్కనపెట్టింది. అతనిస్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్ తీసుకొచ్చింది.

అయితే ఈ నిర్ణయం చెన్నై అభిమానులకు తీవ్ర నిరాశపరిచింది. అయితే బ్రావోను పక్కన పెట్టడానికి గల కారణాన్ని టాస్ సందర్భంగా ధోనీ వెల్లడించాడు. భవిష్యత్తు మ్యాచ్‌ల కోసమే అతనికి విశ్రాంతినిచ్చామని చెప్పాడు. అతనిపై ఉన్నపని ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. కరీబియన్ లీగ్‌లో అతనికి కొన్ని నిగిల్స్ ఉన్నాయని, అవి పెద్దవ్వకుండా ఉండేందుకే రెస్ట్ ఇచ్చామని చెప్పాడు.

బ్రావో గాయం తిరగబెట్టకుండా..

బ్రావో గాయం తిరగబెట్టకుండా..

‘మా జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. డ్వేన్ బ్రావో స్థానంలో కరన్ జట్టులోకి వచ్చాడు. సీపీఎల్‌లో అతను గాయంతో బాధపడ్డాడు. ఆ ఇంజ్యూరీకి సంబంధించి కొన్ని నొప్పులు అతనికి ఇంకా ఉన్నాయి. అవి మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకే విశ్రాంతనిచ్చాం. ఇక జట్టుకు సపోర్ట్ స్టాఫ్ అవసరం చాలా ఉంటుంది.

అందులో అనుభవం కలిగిన ఆటగాళ్లుంటే జట్టుకు ఇంకా మేలు జరుగుతుంది. ఐపీఎల్‌లో కాంబినేషన్స్ మేనేజ్ చేయడం చాలా ముఖ్యం'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇక యూఏఈకి ఆలస్యంగా వచ్చిన సామ్ కరణ్ క్వారంటైన్ పూర్తి చేసుకొని గత మ్యాచ్‌కే సిద్దమైనప్పటికీ.. అతనికి నేటి మ్యాచ్‌లో అవకాశం దక్కింది.

రెండు విజయాల్లో కీలక పాత్ర..

రెండు విజయాల్లో కీలక పాత్ర..

సెకండాఫ్ లీగ్‌లో బ్రావో దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో(23, 3/25) బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. ఆల్‌రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గేమ్ చేంజర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీతో పాటు మూడు కీలక వికెట్లు తీసి ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. స్లోయర్, నకుల్ బాల్స్‌తో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. సీపీఎల్‌లో తన టీమ్‌ను గెలిపించి మంచి జోష్‌లో ఉన్న బ్రావోను కీలక మ్యాచ్‌ల కోసం సీఎస్‌కే కాపాడుకుంటుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరువవ్వడంతో రిస్క్ తీసుకోవడం లేదు.

బ్రావో మై బ్రదర్..

బ్రావో మై బ్రదర్..

ఆర్‌సీబీపై విజయానంతరం మాట్లాడిన ధోనీ బ్రావోపై ప్రశంసల జల్లు కురిపించాడు.అతన్ని బ్రదర్ అని పిలుస్తుంటానని, తమ మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరుగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. బ్రావో స్లో బౌలర్ అనే విషయం అందరికి తెలుసని, అందుకునే ఓవర్‌లో ఆరు వైవిధ్యమైన బంతులేయాని ఎప్పుడు చెబుతూ ఉంటానన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే చేయమన్నానని చెప్పాడు.

'బెంగళూరు శుభారంభం చేసింది. అయితే, తొమ్మిదో ఓవర్‌ తర్వాత పిచ్‌ కాస్త నెమ్మదించింది. పడిక్కల్‌ ఆడేటప్పుడు జడేజా స్పెల్‌ కీలకమైంది. మరో ఎండ్‌ నుంచి మొయిన్‌ అలీని బౌలింగ్‌ చేయాలని ముందే చెప్పా. కానీ డ్రింక్స్‌ సమయంలో బ్రావోని దింపాలని ప్రణాళిక మార్చుకున్న. అలాంటి పిచ్‌పై బ్రావో వరుసగా నాలుగు ఓవర్లు వేస్తే బాగుంటుందని అనిపించింది' అని ధోనీ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

తుది జట్లు:

చెన్నై సూపర్‌ కింగ్స్‌: ఫాఫ్ డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, సామ్‌ కరన్, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, జోష్‌ హేజిల్‌వుడ్.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 26, 2021, 15:59 [IST]
Other articles published on Sep 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X