ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్.. కెప్టెన్ ధోనీకి భారీ జరిమానా!

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ సేన నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది. దాంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు. టోర్నీలో మరోసారి రిపీట్ అయితే జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉంది.

బీసీసీఐ రూల్స్ ప్రకారం..

బీసీసీఐ రూల్స్ ప్రకారం..

ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయల సమయాన్ని మినహాయిస్తారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ సేన నిర్ణీత సమయంలో 18.4 ఓవర్లను మాత్రమే పూర్తి చేసింది. దీంతో కెప్టెన్ మహీపై చర్యలు తీసుకుంటు జరిమానా విధించారు.

అదే కారణం..

అదే కారణం..

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా (54) అర్ధశతకంతో మెరవగా సామ్ కరన్ (34), మొయిన్ అలీ (36) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (72), శిఖర్ ధావన్ (85) మొదటి వికెట్​కు 138 పరుగులు జోడించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఓవర్ మధ్యలో బౌలర్లతో చర్చలు, ఫీల్డింగ్ కూర్పుపై ధోనీ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. అదే ఇప్పుడు అతని జరిమానాకు కారణమైంది.

 రీపీట్ అయితే మ్యాచ్ నిషేధం..

రీపీట్ అయితే మ్యాచ్ నిషేధం..

ఐపీఎల్‌ కొత్త నిబంధనల ప్రకారం ఒకజట్టు మొదటిసారి స్లోఓవర్‌ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి అదే తప్పు రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. ఈ లెక్కన మహీ మరో రెండు సార్లు స్లో ఓవర్‌రేట్‌కు కారణమైతే ఓ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 11, 2021, 15:31 [IST]
Other articles published on Apr 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X