ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఏదో తెలుసా?.. సన్‌రైజర్స్‌ది ఎనిమిదో స్థానం!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్‌ మొదలైంది. చెన్నై చెపాక్ మైదానం వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల వివరాలు ఓసారి పరిశిలిద్దాం.

అగ్రస్థానంలో ముంబై:

అగ్రస్థానంలో ముంబై:

ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఐదు టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఉంది. ఐపీఎల్‌లో 203 మ్యాచులు ఆడిన ముంబై ఇప్పటివరకు 118 విజయాలు అందుకుంది. 81 మ్యాచులలో ఓడి.. నాలుగింటిని టైగా ముగించింది. 179 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 106 విజయాలతో రెండో స్థానంలో ఉంది. 71 మ్యాచులలో ఓడి.. మ్యాచును టైగా ముగించింది. ఇంకో దాంట్లో ఫలితం రాలేదు. నిషేధం కారణంగా చెన్నై రెండేళ్లు ఐపీఎల్ ఆడని విషయం తెలిసిందే. విన్నింగ్ పర్సెంటేజ్ పరంగా చూస్తే.. ముంబై (58.13) కంటే చెన్నై (59.22) ముందుండి.

 సన్‌రైజర్స్ @ 8:

సన్‌రైజర్స్ @ 8:

ఐపీఎల్‌లో 195 మ్యాచులు ఆడిన కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ 98 విజయాలతో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతా 90 మ్యాచులలో ఓడి.. 4 మ్యాచులను టైగా ముగించింది. ఇంకో మూడింట్లో ఫలితం రాలేదు. 89 విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంలో ఉంది. మొత్తంగా 197 మ్యాచులు ఆడి 100 ఓటములను ఎదుర్కొంది. 3 మ్యాచులను టైగా ముగించి.. ఇంకో ఐదింటిలో ఫలితం రాలేదు. 85 విజయాలతో పంజాబ్ కింగ్స్ ఇదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ (84), రాజస్థాన్ రాయల్స్ (79), సన్‌రైజర్స్ హైదరాబాద్ (65), డెక్కన్ ఛార్జర్స్ (29), రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ (13), గుజరాత్ లయన్స్ (13), పూణే వారియర్స్ (12), కొచ్చి టస్కర్స్ (6) వరుసగా ఉన్నాయి.

అత్యధిక స్కోరింగ్ సాధించిన జట్టు:

అత్యధిక స్కోరింగ్ సాధించిన జట్టు:

ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరింగ్ సాధించిన మూడు జట్లను పరిశీలిద్దాం. 2010లో చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్‌పై 246 పరుగులు చేసింది. చెన్నై సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. మురళీ విజయ్ 127 పరుగులు చేశాడు. రాజస్థాన్ ఛేదనను దాటిగా ఆరభించింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 223 పరుగులు చేయగలిగింది. 2016‌లో గుజరాత్ లయన్స్‌పై ఆర్‌సీబీ 248 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లయన్స్ కేవలం 104 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు 2013లో పూణేను ఘోరంగా ఓడించింది. 5 వికెట్ల నష్టానికి బెంగళూరు 263 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో గేల్ అజేయంగా 175 పరుగులు చేశాడు. పూణేపై ఆర్సీబీ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2021: ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన సూర్యకుమార్!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 8, 2021, 22:27 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X