
అత్యధిక వికెట్లు తీయడమే నా కల:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మహ్మద్ సిరాజ్ ఆడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన సిరాజ్ తన కెరీర్ గురించి అనేక అంశాలు పంచుకున్నాడు. 'టీమిండియాకు నేను బౌలింగ్ చేసినప్పుడల్లా జస్ప్రీత్ బుమ్రా నా పక్కనే ఉండేవాడు. ప్రాథమిక అంశాలకు లోబడి బౌలింగ్ చేయమని, అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దని చెప్పాడు.
అతడి నుంచి నేర్చుకోవడం గొప్ప విషయం. ఇషాంత్ శర్మతోనూ కలిసి ఆడాను. అతను వంద టెస్టులాడాడు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం మరచిపోలేనిది. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే నా కల. అందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతా' అని సిరాజ్ తెలిపాడు.

నాన్న లేరనే వార్త తెలిసింది:
'ఆస్ట్రేలియా పర్యటన సమయంలో క్వారంటైన్లో ఉండగా.. ప్రాక్టీస్ నుంచి తిరిగొచ్చాక మా నాన్న లేరనే వార్త తెలిసింది. దురదృష్టం కొద్దీ ఆ సమయంలో నా గదికి ఎవరూ వచ్చే అవకాశం లేకపోయింది. అప్పుడు మా అమ్మకు ఫోన్ చేశా. తను ఎంతో అండగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్న మా నాన్న కోరిక నెరవేర్చాలని చెప్పింది. అందుకే అక్కడే ఉండిపోయా. ఇక కోచ్ భరత అరుణ్‌తో మాట్లాడినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన నా బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నన్ను సొంత కొడుకులా చూసుకుంటారు' అని సిరాజ్ చెప్పాడు.

అప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది
ఐపీఎల్ 2020పై మహ్మద్ సిరాజ్ స్పందిస్తూ... 'ఐపీఎల్ 2020లో నేను కొత్తగా చేరినప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేను. కొత్త బంతితో బౌలింగ్ చేసేకొద్దీ అలవాటు పడ్డా. తర్వాత కేకేఆర్ (4-2-8-3)తో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆర్సీబీ తీరు బాగుంటుంది. అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020లో సత్తాచాటడంతో సిరాజ్ ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ కూడా రాణించి ఇంగ్లండ్ పర్యటనలో చోటు దక్కించుకుని అంచనాలను అందుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2021పై దృష్టి పెట్టాడు.
Sunil Gavaskar All-Time IPL XI: కెప్టెన్‌గా ధోనీ..మలింగలకు షాక్! నలుగురు బౌలర్లకే అవకాశం!!