For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs CSK: ఐపీఎల్ 2021 సీజన్‌ ముగిసేలోపు అతడికి పంజాబీ నేర్పిస్తాం: షమీ

IPL 2021, PBKS vs CSK: Mohammed Shami says Chris Gayle Learning Punjabi from Punjab players.

ముంబై: విండీస్ హిట్టర్, యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్..‌ కరీబియన్‌ అయినా భారత్‌తో మాత్రం ఎప్పటినుంచోమంచి అనుబంధం కొనసాగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ సీజన్‌ ఆరంభమైన నాటి నుంచి ప్రతీ సీజన్‌లో ఆడుతూ వస్తున్న గేల్..‌ ఇండియా అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన విధ్వంసకర ఆటతీరుతో క్షణాల్లో మ్యాచ్‌లను మార్చివేసే గేల్‌కు భారత్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్దమవుతున్నక్రిస్ గేల్‌ గురించి కింగ్స్ పంజాబ్ పేసర్ మహ్మద్‌ షమీ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు. గేల్‌ కరీబియన్‌ నుంచి వచ్చినా.. ఇండియాకు ఎప్పుడో దగ్గరయ్యాడన్నాడు. గేల్‌కు హిందీ వచ్చని, ఇక పంజాబీ కూడా నేర్పిస్తామని షమీ తెలిపాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడి 4812 పరుగులు సాధించాడు. విండీస్ తరఫున గేల్ 103 టెస్టులు, 301 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.

'గేల్‌ కరీబియన్‌ నుంచి వచ్చినా.. ఇండియాకు ఎప్పుడో దగ్గరయ్యాడు. గేల్ భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని గౌరవిస్తాడు. హిందీలో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాడు. మాతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‌లో ఆరంభించినా.. సడెన్‌గా హిందీలోకి మారిపోతాడు. ఇప్పుడిక పంజాబ్‌ కింగ్స్‌కు ఆడుతున్నాడు కాబట్టి గేల్‌ పంజాబీ కూడా నేర్పాల్సి ఉంటుందేమో. సీజన్‌ ముగిసేలోపు మా జట్టు ఆటగాళ్లమంతా కలసి ఎలాగైనా అతడికి పంజాబీ నేర్పిస్తాం' అంటూ సరదాగా పేర్కొన్నాడు.

14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తాజాగా.. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో 350 సిక్స్ మార్క్‌ను అందుకున్నాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. బెన్ స్టోక్స్ వేసిన 8వ ఓవర్ మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, గేల్‌కు అదే మొదటి సిక్స్ కావడం విశేషం.

Story first published: Friday, April 16, 2021, 20:14 [IST]
Other articles published on Apr 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+