న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: స‌న్‌రైజ‌ర్స్‌కు భారీ షాక్‌.. స్టార్ పేస‌ర్‌కు గాయం! ఆడేది అనుమానమే!

IPL 2021, MI vs SRH: VVS Laxman says T Natarajan didnt play due to knee injury

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. స‌న్‌రైజ‌ర్స్ స్టార్ పేస‌ర్‌ టీ న‌ట‌రాజ‌న్‌కు మోకాలి గాయం అయింది. ఈ విష‌యాన్ని ఆ జట్టు టీమ్ మెంటార్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్షణ్ స్వయంగా చెప్పాడు. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌కు న‌ట‌రాజ‌న్‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై పెద్ద చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై ల‌క్ష్మ‌ణ్ స్పందించాడు.

మ్యాచ్ అనంతరం వీవీఎస్ లక్షణ్ మాట్లాడుతూ... 'దురదృష్టవశాత్తు నటరాజన్ ఈ మ్యాచ్ ఆడలేదు. ముంబైతో మ్యాచ్ ఆడ‌టానికి అత‌డు ఫిట్‌గా లేడు. నటరాజన్ ఎడ‌మ మోకాలికి గాయ‌మైంది. అందుకే అత‌ని స్థానంలో ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను తీసుకున్నాము. న‌ట‌రాజ‌న్ ప‌రిస్థితిని స‌న్‌రైజ‌ర్స్ మెడిక‌ల్ టీమ్ సమీక్షిస్తోంది. అత‌నికి, ఫ్రాంచైజీకి ప్ర‌యోజ‌నం క‌లిగేలా వారు నిర్ణ‌యం తీసుకుంటారని నేను నమ్ముతున్నా' అని తెలిపాడు. నటరాజన్ మరో 2-3 మ్యాచులు ఆడేది అనుమానమే అని సమాచారం తెలుస్తోంది. న‌ట‌రాజ‌న్‌కు విశ్రాంతి ఇచ్చాం త‌ప్ప.. ప‌క్క‌న పెట్ట‌లేద‌ని టీమ్ డైరెక్ట‌ర్ టామ్ మూడీ కూడా చెప్పాడు. ఇప్ప‌టికే అత‌డు చాలా క్రికెట్ ఆడాడని, ఈ టోర్నీలో కూడా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున విశ్రాంతి ఇచ్చామన్నాడు.

IPL 2021, MI vs SRH: VVS Laxman says T Natarajan didnt play due to knee injury

తంగరసు నటరాజన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఖ‌లీల్ అహ్మ‌ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అద్భుత బంతులు వేసిన ఖ‌లీల్‌పై వీవీఎస్ లక్షణ్ ప్రశంసలు కురిపించాడు. 'ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడినా.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేసిన తీరుతో నేను చాలా సంతోషంగా ఉన్నా. అతడు పరిస్థితులను బాగా అంచనా వేశాడు. బంతుల్లో వైవిద్యం చూపించాడు. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసివచ్చింది' అని హైదరాబాద్ సొగసరి పేర్కొన్నాడు.

చెన్నై వేదికగా శనివారం ముంబైతో జరిగిన పోరులో హైదరాబాద్‌ 13 పరుగుల తేడాతో ఓడింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 150/5 స్కోరు చేసింది. డికాక్‌ (40), పొలార్డ్‌ (22 బంతుల్లో 35), రోహిత్‌ (32) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, రహమాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (43), వార్నర్‌ (36) తప్ప మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో చహర్‌, బౌల్ట్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!

Story first published: Sunday, April 18, 2021, 13:27 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X