మరో అద్దిరిపోయే రికార్డ్‌కు చేరువలో రోహిత్: ఆ మైల్ స్టోన్‌కు దగ్గరగా: జాయింట్‌గా జాయిన్

IPL 2021 : Rohit Sharma Just 28 Runs Short Of 4000 Runs In T20s As Captain || Oneindia Telugu

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ వార్నర్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది.

రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏ మాత్రం రాణించగలిగినా.. మరో మైల్ స్టోన్‌ను అందుకుంటాడు. కేప్టెన్‌గా నాలుగు వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి రోహిత్ శర్మ ఎంతో దూరంలో లేడు. ఇంకో 28 పరుగులు చేయగలిగితే చాలు. రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో సాధించిన పరుగులు 5,292. ఇదివరకు ముంబై ఇండియన్స్‌కు సచిన్ టెండుల్కర్ సారథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. అతని కేప్టెన్సీలో ఓపెనర్‌గా ఆడాడు రోహిత్ శర్మ. రోహిత్ కంటే ముందు ఈ రికార్డ్‌ను అందుకున్న వారిలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కేప్టెన్‌గా ధోనీ 4,632 పరుగులు చేశాడు.

ఇదే మ్యాచ్‌లో రెండు జట్లకు చెందిన క్రికెటర్లు కొన్ని మైల్‌స్టోన్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డేవిడ్ వార్నర్ ఇంకో అయిదు సిక్సులు కొడితే.. 200 క్లబ్‌లో జాయిన్ అవుతాడు. అదే కీరన్ పొల్లార్డ్‌కైతే రెండు సిక్సులు చాలు. పొల్లార్డ్ ఇప్పటిదాకా 198 సిక్సులు కొట్టాడు. మనీష్ పాండే కూడా అలాంటి మైలురాయికి చేరువగా ఉన్నాడు. ఇంకో రెండు సిక్సులు బాదితే.. సిక్సుల సెంచరీని అందుకుంటాడతను. ప్రస్తుతం అతని ఖాతాలో 98 సిక్సర్లు ఉన్నాయి. మరోవంక కృనాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్ తలో రెండు వికెట్లు పడగొడితే 50 వికెట్ల క్లబ్‌లో జాయింట్‌గా జాయిన్ అవుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, April 17, 2021, 14:20 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X