IPL 2021: 'చెపాక్‌ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌ ఆడలేనివి కావు.. నిలకడగా ఆడుతూ అలవాటు పడాలి'

చెన్నై: చెన్నై చెపాక్‌ స్టేడియంలోని పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌ ఆడలేనివి కావని, కాస్త నెమ్మదిగా స్పందించడంతో సవాళ్లు విసురుతాయని ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మహేల జయవర్దనే అన్నాడు. చెపాక్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరిగాయని, అందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఐదుసార్లు విజయం సాధించాయన్నాడు. ఇదే మైదానంలో ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 204 పరుగుల అత్యధిక స్కోర్‌ సాధించిందని జయవర్దనే పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తొలి దశలో మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈసారి ఏ జట్టుకూ సొంత మైదానంలో ఆడే అవకాశం లేదు.

చెపాక్‌ పిచ్‌లు ఆడలేనివి కావు:

చెపాక్‌ పిచ్‌లు ఆడలేనివి కావు:

తాజాగా ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మహేల జయవర్దనే చెపాక్ మైదానంలోని పిచ్‌ల గురించి మాట్లాడాడు. 'చెపాక్‌ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌ ఆడలేనివి కావు. అక్కడున్నవి మంచివే. అయితే సవాళ్లతో కూడుకున్నవి. ఆ పరిస్థితులకు అలవాటు పడటం ఏ బ్యాట్స్‌మన్‌కైనా, జట్టుకైనా ఎంతో ముఖ్యం. మేం నిలకడగా ఆడుతూ అలవాటు పడుతున్నాం. అక్కడి పిచ్‌లు పరీక్ష పెట్టినా.. మా బౌలర్లు పరిస్థితులకు అలవాటు పడ్డారు. బ్యాట్స్‌మెన్‌ కూడా గాడిలో పడ్డారు' అని జయవర్దనే అన్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇదే పిచ్‌పై ముంబై తలపడనుంది. ఈ మ్యాచులో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని రోహిత్ సేన చూస్తోంది.

 హార్దిక్‌ త్వరలోనే బౌలింగ్‌ చేస్తాడు:

హార్దిక్‌ త్వరలోనే బౌలింగ్‌ చేస్తాడు:

'ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా త్వరలోనే బౌలింగ్‌ చేస్తాడు. ఐపీఎల్ 2021కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో హార్దిక్‌ ఇబ్బంది పడ్డాడు. దాంతో ప్రస్తుతం అతడు భుజం నొప్పితో సతమతమౌతున్నాడు. హార్దిక్‌ స్వతహాగా బౌలింగ్‌ చేసేందుకు ముందుకొచ్చినప్పుడు తప్పకుండా అతడి సేవలు వినియోగించుకుంటాం. మేము కావాలనే అతడికి బౌలింగ్‌ ఇవ్వడం లేదనేది నిజం కాదు' అని జయవర్దనే స్పష్టం చేశాడు. 2019 సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. ఆపై ఆసీస్, ఇంగ్లండ్ పర్యటనల్లో కూడా రాణించి.. ఐపీఎల్ 2021లో సత్తాచాటుతున్నాడు.

చహర్‌పై ప్రశంసల వర్షం:

చహర్‌పై ప్రశంసల వర్షం:

గత రెండు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసిన రాహుల్‌ చహర్‌పై ముంబై కోచ్‌ మహేల జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఏడాది బాగా మెరుగవుతున్నాడని మెచ్చుకున్నాడు. 2019లో తొలిసారి అతడికి అవకాశం ఇచ్చామని, దాంతో అతడేంటో నిరూపించుకున్నాడన్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లోనూ బాగా రాణించాడన్నాడు. అయితే మధ్యలో ఒడుదొడుకులతో నిలకడగా వికెట్లు తీయలేకపోయాడని గుర్తుచేశాడు. రాహుల్ యువ క్రికెటర్‌ కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకునే స్థాయిలో ఉన్నాడన్నాడని ముంబై కోచ్ తెలిపాడు. స్పిన్‌ విభాగంలో కృనాల్‌ పాండ్యాతో కలిసి వికెట్లు పంచుకోవడం బాగుందని ఆయన ప్రశంసించాడు.

IPL 2021: ముద్దుగుమ్మలతో భలే డ్యాన్సులు.. పాండ్యా బ్రదర్స్‌ ఇరగదీశారుగా!! (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 19, 2021, 21:03 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X