For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs MI: అందుకే రోహిత్ శ‌ర్మ ఆటోగ్రాఫ్ తీసుకున్నా: ఢిల్లీ బౌల‌ర్

IPL 2021: MI captain Rohit Sharma signs DC pacer Avesh Khans jersey

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021‌లో పేసర్ ఆవేశ్‌ ఖాన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్‌లాడిన ఆవేశ్‌.. ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్‌ జాబితాలో ఇపుడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్‌ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చహర్ వికెట్లను అతడు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

‌ఆవేశ్‌ ఖాన్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ అంటే విపరీతమైన అభిమానం. అందుకే మ్యాచ్ త‌ర్వాత త‌న జెర్సీపై రోహిత్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆవేశ్‌ అభిమానానికి ఫిదా అయిన రోహిత్.. ముసిముసిగా న‌వ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటోల‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ పుణ్య‌మాని వ‌ర‌ల్డ్‌క్లాస్ ప్లేయ‌ర్స్‌తో ఆడే అవ‌కాశం యువ ఆటగాళ్లకు ద‌క్కుతోంది. త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌తోనే క‌లిసి ఆడుతుండ‌టాన్ని వాళ్లు త‌మ అదృష్టంగా భావిస్తున్నారు.



రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో అభిమానం అని మ్యాచ్‌ తర్వాత ఆవేశ్‌ ఖాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌తో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్‌ చేయడం ఆనందం కలిగించిందన్నాడు. ఐపీఎల్ టోర్నీ ద్వారా ఎందరో గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నానని, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నానని ఆవేశ్‌ పేర్కొన్నాడు. ఢీల్లీ డ్రెసింగ్ రూమ్ ప్రశాంతంగా ఉంటుందని, సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇస్తున్నారన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రాంచైజీకి ఆవేశ్‌ ధన్యవాదాలు చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్ స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరలో ఢీల్లీ వికెట్లు కోల్పోయి ఉత్కంఠ రేపినా.. చివరికి నో బాల్ ద్వారా గెలిచింది.

Story first published: Wednesday, April 21, 2021, 17:22 [IST]
Other articles published on Apr 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+