IPL 2021: బిగ్ పిక్చర్: నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ ట్రాక్ రికార్డ్ ఇదే: కలిసి రాని చెన్నై పిచ్

చెన్నై: మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో భాగంగా ఆ సాయంత్రం మరో హైఓల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆలరించనుంది. ఐపీఎల్ 2021 మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ రెండు జట్ల పోరాటానికి వేదికగా మారింది.
సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌తో పోల్చుకుంటే గత ఏడాది ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ అద్భుతంగా రాణించింది. మూడోస్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

కోల్‌కతపై బ్యాడ్ ట్రాక్ రికార్డ్
ఇవాన్ మోర్గాన్ సారథ్యంలోని నైట్ రైడర్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ట్రాక్ రికార్డ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సన్ రైజర్స్‌పై నైట్ రైడర్స్‌దే పైచేయి. ఐపీఎల్ మ్యాచుల్లో ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 19 సార్లు తలపడ్డాయి. సన్ రైజర్స్ ఏడుసార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. 12 సార్లు పరాజయం పాలైంది. ఈ సంఖ్యను మెరుగుపరచుకోవాలని ఈ రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ సంగతెలా ఉన్నప్పటికీ.. చెెన్నై చెపాక్ స్టేడియం పిచ్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రతికూలంగానే ఉంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడిన మూడు మ్యాచుల్లో వార్నర్ సేన ఓటమి పాలైంది.

పిచ్ రికార్డ్..
చెన్నై పిచ్‌పై కోల్‌కత ట్రాక్ రికార్డు కూడా దాదాపు అంతే. ఇప్పటిదాకా నైట్ రైడర్స్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లను ఆడతా ఏడింట్లో ఓడిపోయింది. రెండు మ్యాచుల్లో మాత్రమే ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించగలిగింది. ఆ రెండింట్లో ఒక్క మ్యాచ్.. కోల్‌కత నైట్ రైడర్స్‌ను 2012 ఐపీఎల్ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలబెట్టింది. ఈ పరిణామాల మధ్య ఈ సారి చెపాక్ స్టేడియంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపే అంశమే. టాస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారుతోందనేది తొలి మ్యాచ్‌లో తేలిపోయింది.

బౌలింగ్ బలంగా..
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇదే పిచ్‌పై సాగిన తొలి మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ సారి పిచ్ తన స్వరూపాన్ని ఎలా మార్చుకుంటుందనేది కూడా ఉత్కంఠతను రేపుతోంది. సాధారణంగా హైదరాబాద్ జట్టు.. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో దిట్ట. అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను అద్భుతంగా వినియోగించుకోగలుగుతుందా టీమ్. ఈ విషయంలో సన్ రైజర్స్ తరువాతే ఇంకే జట్టయినా. ఎలాంటి బ్యాట్స్‌మెన్లనయినా క్రీజ్‌లో కట్టి పడేసి, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయనివ్వని సత్తా హైదరాబాద్ బౌలర్స్‌కు ఉంది.

మరో 88 పరుగులు చేస్తే..
ఈ మ్యాచ్‌లో గనక డేవిడ్ వార్నర్ విజృంభించి ఆడగలిగితే.. ఓ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పినట్టవుతుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌పై వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ ఆవిర్భవిస్తాడు. దీనికోసం అతను 88 పరుగులను చేయాల్సి ఉంది. 2019 తరువాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. ఇప్పటిదాకా 28 ఇన్నింగుల్లో అతను 1240 పరుగులు చేశాడు. అతని కంటే ముందు కేఎల్ రాహుల్ ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications