న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs DC: డెడ్లీ కాంబో: ఈ మ్యాచ్ ఓడితే..రోహిత్ అండ్ టీమ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?

IPL 2021, Match 13: DC vs MI Prediction, Playing XI are here

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే డజను మ్యాచులు పూర్తయ్యాయి. అన్ని జట్లూ మూడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. నాలుగో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 13వది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌ ఫైనల్‌లో తలపడింది ఈ రెండు జట్లే. ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా ఆవిర్భవించింది. ఈ సారి కూడా ఈ రెండు జట్లు టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గా నిలిచాయి.

సమవుజ్జీల పోరు..

సమవుజ్జీల పోరు..

ఈ మ్యాచ్‌ సమవుజ్జీల పోరుగా అభివర్ణించవచ్చు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టే స్థాయిలో ఉంది ఢిల్లీ కేపిటల్స్. బ్యాటింగ్.. బౌలంగ్‌లో ఏ మాత్రం తీసిపోని విధంగా తయారైంది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధవన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు అజింక్య రహానె, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, మార్కస్ స్టోయినిస్‌లతో బలంగా ఉందా జట్టు. అన్రిచ్ నోర్ట్జె, కగిసొ రబడ, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్ వంటి బౌలర్లు ఎలాంటి బ్యాట్స్‌మెన్లను కూడా కట్టి పడేయగలరు. తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో లేని నోర్జ్టె ఈ సారి అందుబాటులో ఉంటున్నాడు.

డెడ్లీ కాంబినేషన్..

డెడ్లీ కాంబినేషన్..

అన్రిచ్ నోర్ట్జె-కగిసొ రబడ డెడ్లీ కాంబినేషన్. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ జట్టుకు తీవ్ర ఇబ్బందులను సృష్టించగలదు ఈ కాంబో. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఈ ఇద్దరూ కలిసి 50కి పైగా వికెట్లను పడగొట్టడం ఎలాంటి టీమ్‌నయినా బెంబేలెత్తించేదే. వారిద్దరూ లైన్ అండ్ లెంగ్త్‌ను అందిపుచ్చుకున్నారంటే.. పరుగుల కోసం శ్రమించాల్సిందే. డెత్ ఓవర్లలో లెథల్ వెపన్లుగా మారే సత్తా ఉందా ఇద్దరికీ. మూడు మ్యాచ్‌లకు అందుబాటులో లేని నోర్ట్జె లైన్ అండ్ లెంగ్త్‌ను అందిపుచ్చుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

ముంబై పరిస్థితేంటీ..

ముంబై పరిస్థితేంటీ..

సీజన్ ప్రారంభంలో ఓ మాదిరిగా ఉంటూ.. టోర్నమెంట్ సాగే కొద్దీ రాటుదేలే సత్తా రోహిత్ శర్మ టీమ్‌కు ఉంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవి చూసింది. మిగిలిన రెండింట్లోనూ విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. భారీ తేడాతో నెగ్గి, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే టాప్ ప్లేస్‌ను అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ప్లేస్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధీనంలో ఉంది.

ముంబై ఓడితే..

ముంబై ఓడితే..

ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ముంబై ఇండియన్స్ టాప్ ఫైవ్‌లో నిలవలేకపోవచ్చు. నాలుగు ఓటములు, నాలుగు పాయింట్లతో అయిదు లేక ఆరో స్థానానికి దిగజారే అవకాశం ఉంది. టాప్ ఫైవ్ నుంచి కిందికి దిగజారిన పరిస్థితిని ఇదివరకెప్పుడూ ముంబై ఇండియన్స్ చవి చూడలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొల్లార్డ్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాట్స్‌మెన్లు, బుమ్రా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లు, పాండ్యా బ్రదర్స్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్న జట్టు అంత తేలిగ్గా ఓడిపోయేది కాదు. ఢిల్లీ కేపిటల్స్ గెలిచినా.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుంది. మూడో స్థానం నుంచి మరింత పైకి ఎగబాకుతుంది.

ప్రాబబుల్స్ ఇలా ఉండొచ్చు..

ప్రాబబుల్స్ ఇలా ఉండొచ్చు..

ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొల్లార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నె, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఆడటానికి అవకాశం ఉంది. ఢిల్లీ కేపిటల్స్ విషయానికి వస్తే.. శిఖర్ ధవన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టొయినిస్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అమిత్ మిశ్రా, నార్ట్జెలకు తుది జట్టులో చోటు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.

Story first published: Tuesday, April 20, 2021, 12:56 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X