
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది.ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరికొద్ది సేపట్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో కోల్‌కతా రెండు మార్పుతో బరిలోకి దిగుతోంది. హర్భజన్ సింగ్ స్థానంలో కమ్లేశ్ నాగరకోటి, షకీబ్ అల్ హసన్ స్థానంలో సునీల్ నరైన్ తుది జట్టులోకి వచ్చినట్లు మోర్గాన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావోకు విశ్రాంతినిచ్చామని, అతని స్థానంలో లుంగి ఎంగిడిని ఎంపికచేసినట్లు మహీ పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో చెన్నై, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని గమనిస్తే.. చెన్నై టీమ్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. 9 మ్యాచ్‌లకిగానూ 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి. రెండు జట్లు గతేడాది ప్లే ఆఫ్ చేరలేదు. ఈ సీజన్లో తలపడడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన చెన్నై ఉత్సాహంతో ఉండగా, వరుసగా రెండింటిలో ఓటమితో కోల్‌కతా ఒత్తిడిలో ఉంది. చెన్నైతో పోరులో గెలవాలని మోర్గాన్‌సేన పట్టుదలతో ఉంది.
తుది జట్లు:
సీఎస్‌కే: ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, లుంగీ ఎంగిడి, సామ్ కరన్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్.
కేకేఆర్: నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ కృష్ణ.