For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021:విదేశీ హిట్టర్లు..స్వదేశీ అగ్రశ్రేణి ఆటగాళ్లు! కేకేఆర్ మూడోసారి ఛాంపియన్ అయ్యేనా!జట్టు పూర్తి వివరాలు

IPL 2021: Kolkata Knight Riders Strength, Weakness, Prediction and key players

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టిన కేకేఆర్.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 సీజన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత గంభీర్‌ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పయికీ.. ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. అయితే గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేశ్‌ కార్తీక్‌ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు.

మోర్గాన్ సారథ్యం కలిసొచ్చేనా

మోర్గాన్ సారథ్యం కలిసొచ్చేనా

‌ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచకప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌.. ఐపీఎల్ 2020 మధ్యలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథ్య బాధ్యతలు అందుకునే సమయానికి వరుస ఓటములతో ఆ జట్టు సతమతమవుతోంది. దీంతో మోర్గాన్‌కు కుదురుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే నాలుగో స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్‌తో చివరివరకు పోటీపడిన కేకేఆర్..‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మోర్గాన్ జట్టును మొదటినుంచే ముందుకు నడపనున్న నేపథ్యంలో టైటిల్ సాధించే దిశగా కేకేఆర్ దూసుకెళ్లనుంది. ఓసారి కేకేఆర్ బలాలు, బలహీనతలు చూద్దాం.

ఆల్‌రౌండర్లే బలం

ఆల్‌రౌండర్లే బలం

ఐపీఎల్‌ జట్లలో అన్నింటిలోకల్లా ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కేకేఆర్‌లోనే. ఆ జట్టు బలం, బలహీనత కూడా అదే. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల విండీస్‌ విధ్వంసక ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ అతిపెద్ద బలం. కానీ రసెల్ గత సీజన్లో తేలిపోయాడు. సునీల్ నరైన్‌ అడపాదడపా రాణిస్తున్నాడు. ఈసారి షకీబ్ అల్ హసన్, బెన్‌ కటింగ్‌ కూడా వీరికి జతయ్యాడు. వీరందరూ రాణిస్తే కేకేఆర్‌కు తిరుగుండదు. వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ఆల్‌రౌండర్.

త్రయం రాణిస్తే

త్రయం రాణిస్తే

యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, కరుణ్ నాయర్.. సీనియర్లు ఇయాన్ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్ బ్యాటింగ్ కేకేఆర్‌కు అతిపెద్ద బలం. గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గిల్‌.. మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. వీరితో పాటు ప్రపంచ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, బెన్‌ కటింగ్‌లను తీసుకుని బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌నూ పటిష్ఠపరుచుకుంది. స్పిన్‌ విభాగంలో కేకేఆర్‌ బలంగా ఉంది. నరైన్‌, కుల్‌దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, పవన్‌ నేగికి తోడు హర్భజన్‌ సింగ్‌ అనుభవం జతకానుంది. కమిన్స్‌, ఫెర్గూసన్‌ లాంటి విదేశీ పేసర్లతో పాటు దేశీయ ఫాస్ట్‌ బౌలర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ, శివమ్‌ మావిలతో పేస్‌ విభాగం దుర్భేద్యంగా ఉంది.‌

బ్యాటింగ్ కూర్పు బలహీనత

బ్యాటింగ్ కూర్పు బలహీనత

పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్న కేకేఆర్‌కు బ్యాటింగ్ కూర్పు ప్రధాన సమస్యగా మారనుంది. నరైన్‌ను ఓపెనర్‌గా పంపే విషయంలో సందిగ్ధత ఉంది. ఓపెనర్‌గా గిల్‌కు జతగా ఎవరిని పంపాలో కూడా తేల్చుకోలేని అయోమయంలో జట్టు ఉంది. ఇక మోర్గాన్‌ లాంటి ఆటగాడు బ్యాటింగ్‌ ఆర్డర్లో 5 లేదా వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కలిసిరాలేదు. తుది జట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉంటారు కాబట్టి.. మోర్గాన్‌, నరైన్‌, రసెల్‌, ఫెర్గూసన్‌, కమిన్స్‌, షకీబ్‌లలో ఎవరిని వదులుకోవాలో తెలీని పరిస్థితి. ఇవ్వని కేకేఆర్‌ సరిదిద్దుకుంటే సరిపోతుంది.

‌కేకేఆర్‌ జట్టు

‌కేకేఆర్‌ జట్టు

బ్యాట్స్‌మెన్‌: ఇయాన్‌ మోర్గాన్ ‌( కెప్టెన్‌‌), శుబ్‌మన్‌ గిల్, నితీష్ రానా, రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), షెల్డన్ జాక్సన్ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ షీఫెర్ట్ ‌(వికెట్‌ కీపర్‌).

ఆల్‌రౌండర్లు: ఆండ్రీ రసెల్, షకీబ్ అల్ హసన్ ,బెన్ కట్టింగ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్. ‌

బౌలర్లు: కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, ప్రసిధ్‌ కృష్ణ, సందీప్ వారియర్, శివం మావి, పాట్ కమిన్స్, పవన్ నేగి, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, వైభవ్ అరోరా.

Story first published: Friday, April 2, 2021, 11:05 [IST]
Other articles published on Apr 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+