KKR vs MI: ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు.. ఈ విజయం బౌలర్లదే: రోహిత్

చెన్నై: జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా పుంజుకున్నారని, ఇలాంటి మ్యాచులు తరచూ జరగవని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చెన్నైలో మొదటి బంతి నుంచే బాదడం కష్టమన్నాడు. సూర్యకుమార్‌ యాదవ అద్భుతంగా ఆడుతున్నాడని రోహిత్ ప్రశంసించాడు. బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట బౌలర్లు విజృంభించడంతో ముంబై ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో చివరలో బౌలర్లు సత్తాచాటడంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

KKR vs MI: రోహిత్ శర్మకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడే!!

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'కోల్‌కతాపై గొప్పగా పోరాడాం. జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా పుంజుకున్నారు. ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు. ఈ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని వచ్చే మ్యాచులలో కొనసాగిస్తాం. పవర్‌ప్లేలో కోల్‌కతా విజృంభించి ఆడింది. ఆట మధ్యలో రాహుల్‌ చహర్ మాకు వికెట్లు అందించాడు. కృనాల్‌ పాండ్యా కీలక ఓవర్లు విసిరాడు. పరుగులు కట్టడి చేశాడు. ఏదేమైనా ఈ గెలుపు ఘనత బౌలర్లకే దక్కుతుంది. బ్యాట్స్‌మన్‌ మాత్రం ఇంకా మెరుగ్గా ఆడాలి. ఇంకొందరు ఫామ్ అందుకోవాల్సి ఉంది' అని అన్నాడు.

'చెన్నై చెపాక్ పిచ్‌లో మొదటి బంతి నుంచే బాదడం కష్టం. చెత్త బంతులకు మాత్రమే షాట్లు ఆడాల్సి ఉంటుంది. అందుకే బ్యాటింగ్‌కు వెళ్లే ముందే ప్రణాళిక వేసుకోవాలి. మేం 15-20 పరుగులు తక్కువే చేశాం. నేను చివరి వరకు క్రీజులో నిలిస్తే బాగుండేది. సూర్యకుమార్‌ యాదవ్ తన ఫామ్‌ కొనసాగించాడు. తొలి ఓవర్లలో అతడు నిర్భయంగా ఆడటం మాకు సానుకూల అంశం. అలాంటి ఆటగాడు మాకు ఎప్పటికీ అవసరమే. ఇన్నింగ్స్ ఆఖర్లోనూ మా వాళ్లు బాగానే పరుగులు చేశారు' అని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచులో రోహిత్‌ 32 బంతుల్లో 43 పరుగులు చేశాడు. రోహిత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.

'ఈ ఓటమి నిరాశ కలిగించినా మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాం. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించాం. కానీ ప్రత్యర్థి బలమైన జట్టని గమనించాలి. కొన్ని పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. చివరి పది ఓవర్లు ఉత్కంఠగా సాగాయి. ఆట సాగే కొద్దీ పిచ్‌ నెమ్మదించిందో లేదో అర్థం కాలేదు. ముంబైతో గత మ్యాచులో బెంగళూరూ ఛేదనలో ఇబ్బంది పడింది. ఏబీ డివిలియర్స్‌ వారిని ఆదుకున్నాడు. మేమిక్కడ గెలుపు ముంగిట బోల్తా పడ్డాం. కృనాల్‌ పాండ్యా తెలివిగా బంతులేశాడు. అతడి బౌలింగ్‌లో ‌ఆండ్రీ రసెల్‌ క్యాచ్‌ను బుమ్రా జారవిడవడంతో విజయంపై ఆశలు కలిగాయి. కానీ అతడూ త్వరగానే ఔట్ అయ్యాడు. బుమ్రా ఛాంపియన్ ప్లేయర్. చివరి ఓవర్లో కేవలం నాలుగు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు' ఇయాన్‌ మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 14, 2021, 8:58 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X