For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆండ్రీ రస్సెల్ హెయిర్ కలర్‌ వేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి లింకేంటో తెలుసా?

IPL 2021: KKRs allrounder Andre Russell comes up new blonde hairstyle

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌ 14వ ఎడిషన్‌లో భాగంగా ఆ సాయంత్రం మరో హైఓల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆలరించనుంది. ఐపీఎల్ 2021 మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ రెండు జట్ల పోరాటానికి వేదికగా మారింది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌తో పోల్చుకుంటే గత ఏడాది ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ అద్భుతంగా రాణించింది. మూడోస్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

కోల్‌కత నైట్ రైడర్స్ ఆడబోయే తొలి మ్యాచ్ ఇది. అందుకే- ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. న్యూ లుక్‌తో కనిపించాడు. జట్టుకు రంగేశాడు. లేత గోధుమ రంగు కలర్‌తో నింపేశాడు. ట్రెండీ హెయిర్ స్టైల్‌తో ఫొటోలకు ఫోజులిచ్చాడు. సాధారణంగా ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు కొత్త లుక్‌తో బరిలోకి దిగడం ఆండ్రీ రస్సెల్‌కు అలవాటే. ఇక్కడే ఓ చిన్న కిటుకు ఉంది. అతను హెయిర్ కలర్ వేసిన సమయంలో ఆడిన మ్యాచ్‌ను కోల్‌కత నైట్ రైడర్స్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్ సీజన్‌లో జుట్టుకు రంగు వేసిన అనంతరం ఆడిన మ్యాచ్‌లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 19 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆటతీరును ప్రదర్శించడానికి ఆండ్రీ రస్సెల్ ఉవ్విళ్లూరుతున్నాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఆండ్రీ పెద్దగా రాణించలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు. 10 మ్యాచ్‌లను ఆడిన అతను 117 పరుగులు మాత్రమే చేశాడు. హ్యయ్యెస్ట్ స్కోర్ 25 పరుగులే. ఆ సీజన్ మొత్తానికీ 88 పరుగులు చేశాడంతే. బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. రెండు వికెట్లు తీసుకున్నాడు. గాయాలు అతన్ని వేధించాయి. కోల్‌కత నైట్ రైడర్స్ గత ఏడాది ప్లే ఆఫ్‌కు కూడా చేరలేకపోవడానికి రస్సెల్ ఫామ్‌ను కోల్పోవడం కూడా ఓ కారణమైంది. ఆ జట్టు గెలుపోటములు.. ఆండ్రీ ఫామ్ మీదే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు.

Story first published: Sunday, April 11, 2021, 15:08 [IST]
Other articles published on Apr 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+