For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి.. అతడు కచ్చితంగా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు: కేకేఆర్‌ మెంటార్‌

IPL 2021: KKR mentor David Hussey said Shubman Gill will find his momentum sooner

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) స్టార్‌ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ మద్దతుగా నిలిచాడు. గిల్‌ కచ్చితంగా తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. అన్ని మ్యాచుల్లో కలిపి 100 పరుగులు కూడా చేయకలేదు. ఒక్క సరైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌పై కూడా పూర్తిగా విఫలమయ్యాడు. 19 బంతుల్లో 11 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.

కోల్‌కతా వరుస ఓటములకు ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్థాయి తగ్గ ఆటను ప్రదర్శించకపోవడం కూడా ఓ కారణమంమంటూ అందరూ మండిపడుతున్నారు. దీనిపై పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో డేవిడ్‌ హస్సీ మాట్లాడాడు. 'గిల్ స్టార్‌ ప్లేయర్‌. టెక్నికల్‌గా కూడా మంచి పట్టున్న ఆటగాడు. ఫామ్‌ అనేది వస్తుంది.. పోతుంది. క్లాస్‌ అనేది ఎప్పుడూ శాశ్వతం. గిల్ క్లాస్‌ ఆటగాడు. ఆఫ్‌ ఫీల్డ్‌, ఆన్‌ ఫీల్డ్‌లో అతనొక క్లాస్‌. నా మాటల్ని గుర్తుంచుకోండి. ఈ సీజన్‌ ముగిసే సరికి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్‌ కూడా ఉంటాడు' అని హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. మరి హస్సీ వ్యాఖ్యలను గిల్ నిజం చేస్తాడేమో చూడాలి.

శుబ్‌మన్‌ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో అర్థ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తన అద్భుత ఆటతో భారత్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక్క అర్ధ శతకం మినహా చెప్పుకోదగిన స్కోర్‌ చేయలేదు. ఐపీఎల్ 2021లో అయినా ఫామ్ అందుకుంటాడేమో అనుకుంటే అది జరగట్లేదు. ఐదు మ్యాచుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటికైనా గిల్ పరుగులు చేస్తేనే కోల్‌కతా వరుస ఓటములకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

ముంబైలోని వాంఖడే మైదానంలో శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (26 బంతుల్లో 36; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. రాజస్థాన్‌ బౌలర్లలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' క్రిస్‌ మోరిస్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (42 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్సర్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి.

Story first published: Sunday, April 25, 2021, 17:14 [IST]
Other articles published on Apr 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+