Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: కేకేఆర్‌ కప్ కొట్టాలి.. అందులోనే నేను కాఫీ తాగాలి!!

IPL 2021: KKR co-owner Shah Rukh Khan gives hilarious reply to fan

కోల్‌కతా: ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగనుంది. ఐపీఎల్ ఆరంభానికి మరో వారం రోజులే ఉండడంతో ప్రాంచైజీ యజమానులు సోషల్ మీడియాలో సందడి మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌)‌ సహా యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌.. బుధవారం ట్విటర్‌ వేదికగా '#AskSRK' ప్రారంభించారు. దీనిలో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుఖ్‌ సమాధానమిచ్చారు.

చిట్‌చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్ షారుఖ్‌ ఖాన్‌ను ఇలా అడిగారు. 'భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా?' అని ప్రశ్నించాడు. అందుకు షారుక్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. 'నేను కూడా కేకేఆర్‌ కప్ కొట్టాలనే కోరుకుంటున్నాను. కేకేఆర్‌ టైటిల్ గెలిస్తే.. ఆ కప్పులో కాఫీ తాగాలని భావిస్తున్నాను' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయింది. బాద్‌ షా సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఆగిపోయిన కేకేఆర్‌.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 విజేతగా నిలిచింది. ఆ తర్వాత ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. గౌతమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌ ప్రదర్శన మరీ పేలవం. నిరుడు దినేశ్‌ కార్తీక్‌ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. కేకేఆర్‌ చివరకు అయిదో స్థానంతో లీగ్‌ను ముగించింది.

కేకేఆర్‌ టీమ్:
దేశీయ ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌, శుభ్‌మన్‌ గిల్‌, హర్భజన్‌ సింగ్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, కుల్‌దీప్‌ యాదవ్‌, కరున్‌ నాయర్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, రింకూ సింగ్‌, పవన్‌ నేగి, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ వారియర్‌, శివమ్‌ మావి, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌, షెల్డాన్‌ జాక్సన్‌

విదేశీయులు: ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), లుకీ ఫెర్గూసన్‌, పాట్ కమిన్స్‌, ఆండ్రీ రసెల్‌, బెన్‌ కటింగ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, సునీల్ నరైన్‌, టిమ్‌ సీఫర్ట్‌;

Story first published: Thursday, April 1, 2021, 8:15 [IST]
Other articles published on Apr 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+