KKR vs MI: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. 12 బంతుల్లోనే!!

చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్.. ఐపీఎల్ 2021లో చరిత్ర సృష్టించాడు. అయితే ఎప్పటిలా తన బ్యాటుతో కాకుండా ఈసారి బంతితో మెరిశాడు. రసెల్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చెపాక్ వేదికగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యచ్‌లో రసెల్ 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో రస్సెల్ తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబైపై 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రసెల్ నిలిచాడు.

ముంబైపై బెస్ట్ గణాంకాలు:
ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరఫున నమోదైన అత్యద్భుత బౌలింగ్ గణాంకాలు ఆండ్రీ రసెల్‌వే కావడం విశేషం. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై ఒక బౌలర్ నమోదు చేసిన బెస్ట్ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే. ఇంతకు ముందు ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు హర్షల్ పటేల్ (5/27) పేరున ఉంది. ఈ సీజన్ ముందు వరకు ఐపీఎల్‌లో ముంబై 203 మ్యాచ్‌లాడగా.. వాటిలో ఒక్కసారీ ఏ ప్రత్యర్థి బౌలరూ 5 వికెట్లు పడగొట్టలేదు. ఈ సీజన్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ముంబైపై 5 వికెట్ల ప్రదర్శనలు నమోదయ్యాయి.

తొలి స్థానంలో రసెల్:
కేకేఆర్ బౌలర్‌గా అత్యుత్తమ గణాంకాలతో ఆండ్రీ రసెల్ తొలి స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ (5/19, కింగ్స్ పంజాబ్, 2012) రెండో స్థానంలో.. వరుణ్ చక్రవర్తి (5/20, ఢిల్లీ క్యాపిటల్స్, 2020) మూడో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో అయిదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు 23 మంది ఉన్నారు. జయ్‌దేవ్ ఉనద్కత్ (2013, 17) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. అల్జారి జోసెఫ్, సోహైల్ తన్వీర్, ఆడమ్ జంపా ఆరేసి వికెట్లు పడగొట్టారు.

ముంబై బోణీ:
స్పిన్నర్ రాహుల్ చహర్ మాయ చేయడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రోహిత్ సేన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 7×4, 2×6), రోహిత్ శర్మ (43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో మొదట ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రసెల్ (5/15), కమిన్స్ (2/24) నిప్పులు చెరిగారు. ఛేదనలో నితీష్ రాణా (57; 47 బంతుల్లో 6×4, 2×6), శుభ్‌మన్ గిల్ (33; 24 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో కోల్‌కతా గెలిచేలా కనిపించింది. చహర్‌తో పాటు కృనాల్ (1/13), బౌల్ట్ (2/27), బుమ్రా (0/28) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications