Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఐపీఎల్ 2021 కోసం బయలుదేరా.. కానీ సుయాజ్‌ కాలువలో చిక్కుకుపోయా'

IPL 2021: Jimmy Neesham Wins Ultimate Troll Battle On Social Media Vs Glenn Maxwell

ముంబై: ఏప్రిల్ 9 నుంచి జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 సందడి షురూ అయింది. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఆటగాళ్లు అందరూ వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తున్నారు. భారత ఆటగాళ్లు కొందరు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు కూడా. ఇక విదేశీ ప్లేయర్స్ కొందరు ఇప్పటికే భారత్ చేరుకోగా.. మరికొందరు ఇక్కడకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్ నీషమ్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

సుయాజ్‌ కాలువలో..

తాజాగా ట్విటర్‌లో జేమ్స్ నీషమ్‌ను ఓ ఐపీఎల్‌ అభిమాని ఒక ప్రశ్న అడిగాడు‌. 'నీషమ్‌.. ఐపీఎల్‌ త్వరలో ప్రారంభమవుతుంది. ముంబై జట్టుతో ఎప్పుడు కలుస్తావ్' అని ప్రశ్నించాడు. దీనికి నీషమ్‌ రిప్లై ఇచ్చాడు. 'నేను ఐపీఎల్‌ 2021 ఆడేందుకు వస్తున్నా. కానీ కార్గో షిప్‌ వల్ల ఇప్పుడు సుయాజ్‌ కాలువలో చిక్కుకుపోయా. త్వరలోనే బయటపడుతా' అంటూ అభిమానికి ఫన్నీ రిప్లై ఇచ్చాడు నీషమ్‌. నీషమ్‌ ఇచ్చిన సమాధానానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

మ్యాక్సీ సెటైర్స్..

'జేమ్స్ నీషమ్‌.. 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్‌లో మోస్తూనే ఉన్నావా. అందుకే చిక్కుకుపోయావు' అంటూ జేమ్స్ నీషమ్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ కౌంటర్ ఇచ్చాడు. అయితే మ్యాక్స్‌వెల్‌ పెట్టిన కామెంట్ ఎవరికీ అర్థం కాలేదు. అసలు కారణం ఏంటంటే.. ఇటీవల కివీస్‌, ఆసీస్‌ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మూడో టీ20లో మ్యాక్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్..​ నీషమ్‌ను ఉతికారేశాడు. నీషమ్‌ వేసిన ఒకే ఓవర్లో వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తంగా 28 పరుగులు పిండుకున్నాడు. అదే అర్ధం వచ్చేలా మ్యాక్సీ ట్వీట్ చేశాడు.

రూ.14.25 కోట్ల భారీ ధరకు..

రూ.14.25 కోట్ల భారీ ధరకు..

గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడిన అతను 108 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. అయితే మ్యాక్స్‌వెల్‌ బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శన చేయడంతో.. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. మరి ఈసారి ఎలా ఆడుతాడో చూడాలి. ఇక నీషమ్‌ గతేడాది ఎక్కువగా మ్యాచులు ఆడలేదు.

రెండు నెలలు పండుగే..

రెండు నెలలు పండుగే..

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్లకూ లేదు. టోర్నీలో మ్యాచ్‌ల్నీ అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి.

Story first published: Tuesday, March 30, 2021, 17:23 [IST]
Other articles published on Mar 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+