For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: బెంగళూరు జట్టులోకి పడిక్కల్‌ ఎంట్రీ.. మండిపడుతున్న ఫ్రాంఛైజీ యాజమాన్యాలు! అసలు కారణం ఇదే?

IPL 2021: IPL Franchises are not happy with Devdutt Padikal entry into RCB

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బోణీ కొట్టిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ యువ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఆడలేదు. రెండు క్రీజుల క్రితమే జట్టుతో కలిసినా.. పడిక్కల్‌కు ముంబైతో మ్యాచ్ ఆడే అవకాశం లభించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పడిక్కల్ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఫ్రాంఛైజీ యాజమాన్యాలు అతనిపై అసంతృప్తిగా ఉండడమే అని సమాచారం తెలిసింది. విషయంలోకి వెళితే

హోటల్ క్వారంటైన్ పూర్తిచేయకుండానే:

హోటల్ క్వారంటైన్ పూర్తిచేయకుండానే:

గతనెల 22న దేవ్‌దత్‌ పడిక్కల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను ఆర్‌సీబీ క్యాంప్‌ను నుంచి నేరుగా హోం క్వారంటైన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. 7 రోజులు హోం క్వారంటైన్‌ అనంతరం జరిపిన కరోనా టెస్టుల్లో పడిక్కల్‌కు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఏప్రిల్ 7న బెంగళూరు నుంచి స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చి చెన్నైలో బస చేస్తున్న ఆర్‌సీబీ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఆ వెంటనే అతడు తప్పనిసరి 7 రోజుల హోటల్ క్వారంటైన్ పూర్తిచేయకుండానే ఆర్‌సీబీ టీం బబుల్‌లోకి ప్రవేశించాడు. మూడు టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చిందనే తాము బబుల్‌లోకి అనుమతిచ్చామని ఆర్‌సీబీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫ్రాంఛైజీల అసంతృప్తి:

ఫ్రాంఛైజీల అసంతృప్తి:

కరోనా నుంచి కోలుకుని మూడు రోజులు కూడా గడవక ముందే దేవ్‌దత్‌ పడిక్కల్‌ను డైరెక్ట్‌గా ఆర్‌సీబీ టీం బయో బబుల్‌లోకి తీసుకురావడంపై ఇతర ఫ్రాంఛైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వారం రోజుల తప్పనిసరి హోటల్ క్వారంటైన్‌ నిబంధనను.. పడిక్కల్‌ విషయంలో ఆర్‌సీబీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రాంఛైజీలు మండిపడుతున్నాయి. ఇలా చేయడం వలన ఇతర ఆటగాళ్లు కూడా వైరస్‌ బారిన పడే ప్రమాదముందని ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. హోమ్‌ క్వారంటైన్‌ అనే ఆప్షన్‌ ఎవరికీ లేనప్పుడు.. ఆర్‌సీబీ ఆటగాడికి మాత్రం ఎలా ఇస్తారని బీసీసీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

బీసీసీఐ రూల్స్ ఏం చెపుతున్నాయంటే:

బీసీసీఐ రూల్స్ ఏం చెపుతున్నాయంటే:

మార్చి 19న ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ కరోనా ప్రోటోకాల్స్ పంపించింది. 14 మరియు 15 పేజీల ప్రకారం... అన్ని ఫ్రాంచైజ్ జట్టు సభ్యులు బబుల్‌లోకి ప్రవేశించే ముందు 7 రోజులు హోటల్ క్వారంటైన్‌ పూర్తిచేయాలి. ఈ ఏడూ రోజుల్లో COVID-19 RT-PCR పరీక్షలు మూడు సార్లు చేస్తారు. ఆ మూడింటిలో నెగటివ్ ఫలితం రావాలి. ఆ తర్వాత బుడగలోకి ప్రవేశించవచ్చు. అయితే పడిక్కల్‌ మాత్రం హోమ్‌ క్వారంటైన్ అనంతరం హోటల్ క్వారంటైన్‌ పూర్తిచేయకుండానే బబుల్‌లోకి ప్రవేశించాడు. అందుకే ప్రాంఛైజీలు అసంతృప్తిగా ఉన్నాయి.

సూపర్ పెర్ఫామెన్స్:

సూపర్ పెర్ఫామెన్స్:

ఈ ఏడాది జరిగిన డొమెస్టిక్ టోర్నీలో దేవ్‌దత్‌ పడిక్కల్ సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. దేశవాళి ప్రతిష్టాత్మ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 737 రన్స్ చేశాడు. ఇదే జోరును ఐపీఎల్‌లో 2021ను కొనసాగించాలని భావిస్తున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పడిక్కల్.. 15 మ్యాచ్‌ల్లో 473 రన్స్ చేశాడు.

Story first published: Saturday, April 10, 2021, 17:50 [IST]
Other articles published on Apr 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+