IPL 2021: రేర్ రికార్డ్: ఏడు మ్యాచుల్లో ఆరుమంది మనోళ్లే: విదేశీ క్రికెటర్ ఒక్కడే: లిస్ట్ ఇదే

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021, 14వ ఎడిషన్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా సాగిన ఏడింట్లో లో స్కోర్ మ్యాచ్‌లే అధికం. భారీ స్కోరు నమోదైంది మూడు మ్యాచుల్లోనే. పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో స్కోర్ డబుల్ సెంచరీ దాటింది. రెండు జట్లూ 200లకు పైగా స్కోర్ సాధించాయి. కోల్‌కత నైట్ రైడర్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్‌లల్లో 180కి పైగా స్కోర్ నమోదైంది. మిగిలిన నాలుగింట్లోనూ 160కి లోపే స్కోర్ రికార్డయింది. అలాంటి మ్యాచుల్లోనూ ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడానికి బ్యాట్స్‌మెన్లు చెమటోడ్చాల్సి వచ్చింది.

ఏడింట్లో ఆరుమంది భారత ఆటగాళ్లే..
ఇప్పటిదాకా జరిగిన ఈ ఏడు మ్యాచుల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు భారతీయ క్రికెటర్లకే దక్కాయి. ఆరుమంది భారతీయ ప్లేయర్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆ ఛాన్స్ విదేశీ ఆటగాడికి దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆరుమందిలో ముగ్గురు బౌలర్లు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ముగ్గురు బౌలర్లు తమ జట్టను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

వాళ్లు.. వీళ్లే
ఇప్పటిదాకా హర్షల్ పటేల్, శిఖర్ ధావన్, నితీష్ రాణా, సంజు శాంసన్, రాహుల్ చాహర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జయదేవ్ ఉనద్కత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వారిలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే విదేశీ క్రికెటర్. హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్.. ముగ్గురూ బౌలర్లే. ముంబై ఇండియన్స్‌తో తలపడిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హర్షల్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 27 పరుగులకు అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

ముగ్గురు బౌలర్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు..
కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రాహుల్ చాహర్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 152 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. కోల్‌కత నైట్ రైడర్స్ ఆ మాత్రం స్కోరును కూడా అందుకోలేకపోవడానికి రాహుల్ చాహర్ కారణం. 27 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్నాడతను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను ఎగరేసుకెళ్లాడు. ముంబై వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్ ఎనిమిది వికెట్లను కోల్పోయి 147 పరుగులే చేయడానికి ప్రధాన కారణం.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్.

జయదేవ్ తడాఖా..
ఈ మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లను తీసుకున్నాడు. మాంఛి ఫామ్‌లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే పరిస్థితీ అంతే. ఉనద్కత్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ టీమ్.. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడానికి ఉనద్కత్ బౌలింగ్ ప్రతాపమే కారణం. ఆ తరువాత ఆ జట్టు పెద్దగా కోలుకోలేకపోయింది. 147 పరుగులే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో జయదేవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications