IPL 2021: కొత్త అవతారంలో ఎంఎస్ ధోనీ.. షాక్‌లో అభిమానులు! అందుకోసమేనా ఈ న్యూ స్టయిల్?

చెన్నై: ఎంఎస్ ధోనీ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహీ అత్యుత్తమ కెప్టెన్ మాత్రమే కాదు.. క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ కూడా. ఆటగాడిగా పలు రికార్డులు.. కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సృష్టించిన నేపథ్యం అతనిది. ఆట, కెప్టెన్సీతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ధోనీ.. సరికొత్త గెటప్‌తో అభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు మహీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సన్యాసి అవతారంలో ఉన్న ధోనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
వాణిజ్య ప్రకటన కోసమేనా
స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న ఎంఎస్ ధోనీ ఫొటోను షేర్ చేసింది. అంతేగాక ఈ అవతారం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండని ఓ ట్వీట్ చేసింది. కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టులో ఓ ట్రెండ్ సెట్ చేసిన ధోనీని చూసిన ఫ్యాన్స్.. ఇప్పుడిలా గుండులో తమ స్టార్ కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ కొత్త గెటప్ ఐపీఎల్ 2021కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో భాగమని పలువురు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే వేచి చూడక తప్పదని అంటున్నారు.

ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే
వాస్తవానికి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే ఎక్కువగా చర్చ నడిచింది. అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జులపాల జుట్టుకి ముచ్చటపడ్డాడు. ధోనీ ఆ జట్టును ఎప్పుడూ కత్తిరించకుండా ఉండాలని కూడా అన్నాడు. ఇక 2011లో భారత్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేయించుకున్న ధోనీ.. మొహక్ స్టయిల్‌ని కూడా ట్రై చేసేశాడు. ఆ తర్వాత ఎన్నో హెయిర్ స్టయిల్స్ మార్చాడు. ఇక ఐపీఎల్ 2020కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. ఇప్పడు సన్యాసి అవతారం ఎత్తాడు.

చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేసిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు గంట సేపు బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోనీ ఆడిన షాట్లలో తన ఫేవరెట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను ఎక్కువసార్లు ఆడాడు. ఐపీఎల్ 2021లో సీఎస్‌కే తమ తొలి మ్యాచ్ ఢిల్లీతో ఆడనుంది.

టైటిలే లక్ష్యంగా:
ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరి దశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన మహీ.. ఈ సీజన్‌లో అదరగొట్టాలనే సంకల్పంతో సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ షురూ చేసిన చెన్నై.. టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications