For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Final: ఫైనల్‌కు ముందు ఎంఎస్ ధోనీ వీరవిహారం.. కోల్‌కతాకు డబిడదిబిడే (వీడియో)!!

IPL 2021 Final: CSK Captain MS Dhoni practices helicopter shots in nets, Sends Warning bells to KKR

దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో మలుపులు తిరిగిన ఐపీఎల్‌ 2021 ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ధోనీ కెప్టెన్సీనే ప్రధాన ఆయుధంగా 9వసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చెన్నై ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే లీగ్‌ తొలి దశలో వెనుకబడినా.. ఆ తర్వాత స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ ఫైట్‌కు చేరిన కోల్‌కతాను కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్‌కు చేరిన రెండుసార్లూ కప్‌ కొట్టిన చరిత్ర కోల్‌కతాది కాగా.. ఎనమిది సార్లు ఫైనల్‌ చేరిన ఘనమైన చరిత్ర చెన్నైది. ఈరోజు దసరా పండుగ కూడా కాబట్టి అభిమానులకు డబుల్ ధమాకే అని చెప్పాలి.

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల ఆటగాళ్లూ నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్​ చేస్తున్న తమ ఆటగాళ్ల వీడియోను చెన్నై తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ప్రాక్టీస్​ సెషన్​లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇరగదీశాడు. భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. కొన్ని బంతులను మైదానం బయటకు కొట్టాడు. మహీ హెలికాప్టర్​​ షాట్​తో కూడా అదరగొట్టాడు. ఈ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. మహీ ఢిల్లీపై చెలరేగిన విషయం తెలిసిందే. 6 బంతుల్లో 18 పరుగులు చేసి చెన్నైకి తనదైన శైలిలో విజయాన్ని అందించాడు. ఈరోజు కూడా మహీ చెలరేగితే.. కోల్‌కతాకు డబిడదిబిడే.

గత మ్యాచ్​కు దూరమైన మిస్టర్ ఐపీఎల్ సురేష్​ రైనా కూడా చెన్నై ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొన్నాడు. దీంతో అతడు తుది పోరులో ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే రాబిన్ ఉతప్ప రూపంలో రైనాకు గట్టిపోటీ ఎదురుకానుంది. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మరోవైపు దీపక్ చహర్, జోష్ జోష్ హాజెల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్‌లో చెన్నై ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలవగా.. మరో టైటిల్ గెలిచేందుకు సిద్ధమవుతోంది.

తుది జట్టు (అంచనా):
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

Story first published: Friday, October 15, 2021, 12:38 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+