BCCIకి ఆ మాత్రం చేతకావట్లేదా? అవి తప్పుడు రిపోర్టులు: ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో అలజడి

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. క్రికెట్ ఆడే దేశాలకు సంబంధించిన ప్రాధీకార సంస్థలన్నింట్లోకి అత్యంత ధనికవంతం, శక్తిమంతం. క్రికెట్ ప్రపంచాన్ని శాసించే సత్తా, శక్తిసామర్థ్యాలు దీనికి ఉన్నాయి. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఙానాన్ని సైతం కలిగి ఉంటోంది. వేల కోట్ల రూపాయలను ఆర్జించే వనరులు ఈ బోర్డుకు మాత్రమే సొంతం. అలాంటి బీసీసీఐపై విమర్శల జడివాన ఆరంభమైంది. బీసీసీఐ అనుసరిస్తోన్న వైఖరి వివాదాలను రేకెత్తిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల్లో గందరగోళానికి, ఆందోళనకు కారణమౌతోంది. అటు ప్లేయర్లలోనూ అసంతృప్తికి, అసహనానికి దారి తీస్తోంది.

అంబటి ఖాతాలో మరో డక్: ఓ అరుదైన లిస్ట్‌లో చోటు: ఎవరెవరు ఉన్నారంటే?

 ఏంటా వైఖరి?

ఏంటా వైఖరి?

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌ను నిర్వహించాల్సి రావడం వల్ల బీసీసీఐ కొన్ని మార్గదర్శకాలు, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బయో సెక్యూర్ బబుల్‌లో చేరదలిచిన ప్రతి ఐపీఎల్ క్రికెటర్‌కూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాతే.. జట్టుతో కలవడానికి, మ్యాచ్‌లను ఆడటానికి అనుమతి ఇస్తోంది బీసీసీఐ. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలన్నీ బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. దీనికోసం సొంతంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

 ఫాల్స్ పాజిటివ్..

ఫాల్స్ పాజిటివ్..

ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు ప్లేయర్లకు కరోనా వైరస్ టెస్టింగులను నిర్వహించింది. ఈ పరీక్షల సందర్భంగా కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్ నితీష్ రాణా, ఢిల్లీ కేపిటల్స్ కీలక బౌలర్ అన్రిచ్ నార్ట్జెకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వారికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీనితో వారు క్వారంటైన్‌లో గడపాల్సి వచ్చింది. నితీష్ రాణాకు కరోనా వైరస్ సోకినట్లుగా కిందటి నెల 22వ తేదీన బీసీసీఐ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. దీనితో అతను క్వారంటైన్‌కు వెళ్లాడు.

 పది రోజుల్లోనే రెండుసార్లు కరోనా నెగెటివ్ ఎలా?

పది రోజుల్లోనే రెండుసార్లు కరోనా నెగెటివ్ ఎలా?

ఏప్రిల్ 2వ తేదీన నెగెటివ్ రిపోర్ట్ రావడంతో ఆ మరుసటి రోజు అతను నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 10 రోజుల్లో రెండుసార్లు అతనికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడే బీసీసీఐ కరోనా నిర్ధారణ పరీక్షల విధానాలపై అనుమానాలు తలెత్తాయి. తొలిసారిగా అతనికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడే అది సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. గానీ దాన్ని ఎవరూ బాహటంగా వెల్లడించలేకపోయారు. అనంతరం నితీష్ రాణా.. జట్టుతో కలిశాడు. నైట్ రైడర్స్ తరఫున మ్యాచ్‌లను ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.

 సెకెండ్ విక్టిమ్.. నార్ట్జె

సెకెండ్ విక్టిమ్.. నార్ట్జె

నితీష్ రాణా తరువాత ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ అన్రిచ్ నార్ట్జె బీసీసీఐ రెండో బాధితుడిగా మారడని అంటున్నారు. అతనికి మూడుసార్లు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టులే వచ్చాయి. దక్షిణాఫ్రికాకు చెందిన నార్ట్జె భారత్‌కు వచ్చిన వెంటనే అతనికి పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్‌ నివేదిక వచ్చింది. ఈ నెల 5వ తేదీన మరోసారి బీసీసీఐ సారథ్యంలో చేపట్టిన టెస్టింగుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో అతను క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అనంతరం అతనికి చేసిన టెస్టింగుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. మూడుసార్లు టెస్టులు చేయగా.. నెగెటివ్‌గానే తేలింది. దీనితో కోల్‌కత నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్ అతణ్ని జట్టులోకి తీసుకుంది.

 ఉద్దేశపూరకంగా చేసింది కాదు కదా..

ఉద్దేశపూరకంగా చేసింది కాదు కదా..

ఈ వ్యవహారం అటు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఫ్రాంఛైజీల్లో గందరగోళానికి దారి తీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లగా.. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొంది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించడానికే తాము టెస్టింగులను నిర్వహిస్తున్నామని తెలిపింది. ఒక్కోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పుగా చూపించే అవకాశ: లేకపోలేదని, ఇది తాము ఉద్దేశపూరకంగా చేసింది కాదని చెబుతోంది. ఈ వ్యవహారం మొత్తంపై ఇన్‌సైడ్ స్పోర్ట్స్ పోర్టల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, April 17, 2021, 10:18 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X