For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్ పర్యటన ఉన్నప్పటికీ.. ఐపీఎల్ 2021 ఆడేందుకు సిద్దమైన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్స్!

IPL 2021: England Players Chooses IPL over Pakistan Tour

హైదరాబాద్: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌లను ఇప్పుడు యూఏఈ, ఓమన్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనుంది. భారతదేశంలో ఇప్పటికే 29 మ్యాచ్‌లు నిర్వహించగా.. మిగిలిన 31 మ్యాచ్‌లు మొత్తంగా నాలుగు మైదానాల్లో జరుగుతాయి. అయితే కొన్ని రోజుల క్రితం విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనడంపై పలు సందేహాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు కొందరు ఐపీఎల్ ఆడనున్నారని ఓ క్రిడా ఛానెల్ పేర్కొంది.

పాకిస్తాన్ టూర్ ఉన్నా

పాకిస్తాన్ టూర్ ఉన్నా

ఐపీఎల్‌ 2021 రెండో దశ సమయంలో ఇంగ్లండ్ జట్టుకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. అందులో పాకిస్తాన్ టూర్ కూడా ఉంది. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే చెప్పేశారని సమాచారం తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 2021లో పాల్గొనేందుకు ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్స్ అందరూ సముఖంగా ఉన్నారట. ఇంగ్లీష్ బోర్డు కూడా ఏమీ అనలేని స్థితిలో ఉందట. ఇక రెండో దశ టోర్నీ ఆరంభం నుంచి లీగ్ ముగిసేవరకు అందరూ అందుబాటులో ఉంటారట. దీంతో ఐపీఎల్ ప్రాంచైజీలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ఆనందంలో ఫాన్స్

ఆనందంలో ఫాన్స్

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ ఆడుతున్నాడు. మొదటి దశలో అతడు దుమ్మురేపిన విషయం తెలిసిందే. చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జొస్ బట్లర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ క్రిస్ జోర్దాన్ ఐపీఎల్ 2021 ఆడేందుకు ఉన్నారట. అయితే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా టోర్నీకి దూరమయిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ 2021కి అందుబాటులో ఉండడంతో ఆయా జట్ల ఫాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

సగం మంది మాత్రమే

సగం మంది మాత్రమే

ఐపీఎల్‌ 2021 రెండో దశ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు కూడా ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు ఇప్పటికే చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్‌ ఆటగాళ్లలో.. సగం మంది మాత్రమే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్ స్మిత్, మార్కస్‌ స్టొయినిస్‌, క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్-నైల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 పార్ట్ -2లో ఆడనున్నారు. వీరితో పాటు జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియెల్‌ సామ్స్‌ కూడా ఐపీఎల్‌కు వస్తారని తెలిసింది.

యూఏఈలో జరగడంతోనే

యూఏఈలో జరగడంతోనే

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో జరుగుతుండటంతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆలోచనలో పడ్డాయని సమాచారం. ఐపీఎల్ 2021లో ఆడే ఆటగాళ్లను అడ్డుకోకుండా ఉండటమే మంచిదని పలు బోర్డులు భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ అనుభవం మెగా టోర్నీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 ఆడేందుకు వస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఐపీఎల్ కోసం కరీబియన్‌ లీగ్‌ను సైతం వెస్టిండీస్‌ బోర్డు ముందుకు జరిపింది. ఆసీస్ ఆటగాళ్లు కూడా ద్వైపాక్షిక సిరీసులను లెక్కచేయకుండా ఐపీఎల్ ఆడుతున్నారు. తాజాగా ఇంగ్లీష్ ఆటగాళ్లు కూడా అదే బాటలో నడిచారు.

Story first published: Friday, August 13, 2021, 16:18 [IST]
Other articles published on Aug 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+