రెడ్ లిస్ట్: సన్‌రైజర్స్ నెత్తిన పిడుగు: బెయిర్‌స్టో కూడా స్వదేశానికి: మోర్గాన్..బట్లర్ సంప్రదింపులు

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌పై పంజా విసురుతోంది. రోజురోజుకూ విజృంభిస్తోంది. సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు వేల సంఖ్యలో రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,771 మంది పేషెంట్లు కన్నుమూశారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాలు 1,97,894కు చేరుకున్నాయి.

వెనక్కి పిలిపించుకోవడంపై
ఈ పరిస్థితులు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోన్నాయి. భారత్‌తో విమాన సంబంధాలను తెంచుకుంటున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశాయి. భారత్ నుంచి వచ్చే విమానాలను నిషేధించాయి. ఇదివరకే భారత్‌ను బ్రిటన్ ప్రభుత్వం రెడ్‌లిస్ట్‌లోకి చేర్చింది.
ఇక ఆస్ట్రేలియా కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది. భారత్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలను విధించడానికి సిద్ధపడుతోంది. ఈ పరిణామాలతో భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను ఆడుతోన్న తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించుకోవాలనే ఒత్తిడి ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై పెరుగుతోంది.

ముగ్గురు ఆసీస్ క్రికెటర్లు వెనక్కి..
ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై..ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమయ్యారు. మిగిలిన ఆసీస్ క్రికెటర్లు కూడా అదే బాటలో ప్రయాణించే అవకాశాలు లేకపోలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ కేపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ వెన్నెముక గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ నుంచి వీడి వెళ్లట్లేదంటూ వార్తలు వచ్చాయి.

ఇంగ్లాండ్ ప్లేయర్లు వీరే..
ఇదిలావుండగా- తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలిపించుకోవాలనే ఒత్తిడి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుపై తీవ్రతరమౌతోన్నట్లు సమాచారం. ఆ దేశానికి చెందిన పలువురు టాప్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్-సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇవాన్ మోర్గాన్-కోల్‌కత నైట్‌రైడర్స్, మొయిన్ అలీ, సామ్ కుర్రమ్-చెన్నై సూపర్ కింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్-రాజస్థాన్ రాయల్స్, సామ్ బిల్లింగ్స్, టామ్ కుర్రన్, క్రిస్ వోక్స్-ఢిల్లీ కేపిటల్స్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్-పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు.

హైదరాబాద్ నెత్తిన పిడుగే
వారిలో బెన్‌స్టోక్స్.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. కరోనా భయంతో లివింగ్‌స్టోన్ స్వదేశానికి వెళ్లిపోయాడు కూడా. మిగిలిన క్రికెటర్లను కూడా వెనక్కి పిలిపించుకోవాలనే ఒత్తిడిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎదుర్కొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే దాదాపు అన్ని జట్లు కూడా నష్టపోతాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు కుప్పకూలిపోతాయి.
ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్.. పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. ఈ హైదరాబాదీ టీమ్‌లో బెయిర్‌స్టో ఎంత కీలకంగా మారడో తెలిసిన విషయమే. ఇప్పటిదాకా ఆడే అవకాం రానప్పటికీ.. జేసన్ రాయ్ కూడా మామూలోడు కాదు. వారందరూ వెనక్కి వెళ్లిపోతే.. ఐపీఎల్ 2021 కళ తప్పినట్టే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications