CSK vs DC: 2019లో చెన్నై హవా.. 2020లో ఢిల్లీది!! 2021లో విజేత గురువా? లేదా శిష్యుడా?!

ముంబై: ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణి చేసింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 'ధోనీ భాయ్ నాకు గురువుతో సమానం' అని గతంలో చెప్పిన రిషబ్ పంత్.. ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ముంబై వాంఖడే మైదానం వేదికగా గురు, శిష్యుల పోరు మరికొద్ది సేపట్లో జరుగనుంది. ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్లుగా తలపడుతున్న వీరి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఏ జట్టు పైచేయి సాధించిందో ఓసారి చూద్దాం.

ధావన్ సెంచరీ:
చెన్నై, ఢిల్లీ జట్లు చివరగా షార్జా వేదికగా 2020 సీజన్‌లో తలపడ్డాయి. ఫాఫ్ డుప్లెసిస్ (58), షేన్ వాట్సన్ (36), అంబటి రాయుడు (45) పరుగులతో రాణించడంతో మొదట చెన్నై 179 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. పృథ్వీ షా మొదటి ఓవర్‌లో రెండో బంతికే బౌలర్ దీపక్ చహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అజింక్య రహానే (8) కూడా త్వరగా ఔటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన ధావన్ (101; 58 బంతుల్లో 14×4, 1×6) సెంచరీ చేసి ఢిల్లీకి విజయం అందించాడు.

పృథ్వీ మెరుపులు:
2020లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమష్టిగా రాణించడంతో విజయం సాధించింది. పృథ్వీ షా 64, ధావన్ 35, పంత్ 37 పరుగులతో రాణించడంతో మొదట ఢిల్లీ 175 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన చెన్నై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో డుప్లెసిస్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగిలిన అందరూ విఫలమయ్యారు. కేదార్ జాదవ్ (26) పోరాడాడు. చెన్నై జట్టులో కీలకమైన డుప్లెసిస్, ధోనీ, జడేజాలను రబాడ పెవిలియన్‌కు పంపి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రఫ్ఫాడించిన డుప్లెసిస్:
2020లో చెన్నైపై ఢిల్లీ పూర్తి అధిపత్యం ప్రదరిస్తే.. 2019లో చెన్నై పైచేయి సాధించింది. 2019 సీజన్ క్వాలిఫయర్-2లో ఇరు జట్లు తలపడ్డాయి. పంత్ 38, మున్రో 27 మినహా ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులేమీ చేయకపోవడంతో 147 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఓపెనర్లు.. డుప్లెసిస్, వాట్సన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. డుప్లెసిస్ 7 ఫోర్లు, వాట్సన్ 4 సిక్స్‌లు బాదాడు. వీరిద్దరూ అర్ధ శతకాలు చేసి ఔటయ్యారు. చివరలో రాయుడు (20) చెన్నైని గెలిపించాడు.

ధోనీ సూపర్ ఇన్నింగ్స్:
చెపాక్ స్టేడియం వేదికగా 2019లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 179 పరుగులు చేసింది. రైనా (59; 37 బంతుల్లో 8×4, 6×1) మెరవగా.. ధోనీ (44; 22 బంతుల్లో 4×4, 6×3) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 180 పరుగుల ఛేదనకు దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో అయ్యర్ (44), ధావన్ (19) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయలేకపోయారు. చివరకు 99 పరుగులు చేసి ఆలౌటైంది. తాహిర్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు.

చెలరేగిన వాట్సన్, రైనా:
2019లో అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ధావన్ (51) అర్ధ శతకంతో రాణించగా.. పంత్ 25, షా 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో వాట్సన్ (44; 26 బంతుల్లో 4×4, 3×6), రైనా (30; 16 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివరలో ధోనీ విజయ తీరాలకు చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications