Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. యాదవ్ ఇన్! రెండు మార్పులతో బరిలోకి ఢిల్లీ!

IPL 2021, DC vs MI: Mumbai Indians won the toss and opted to bat, Jayant Yadav in

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు మరికొద్ది సేపట్లో చెన్నైలోని చెపాక్ మైదానంలో తలపడబోతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. ఆడమ్ మిల్నే స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఢీల్లీ సారథి రిషబ్ పంత్ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. షిమ్రాన్ హెట్‌మెయర్, అమిత్ మిశ్రా మ్యాచ్ ఆడుతున్నారు.

హెడ్ టు హెడ్ రికార్డుల పరంగా చూసుకుంటే ఢిల్లీపై ముంబై‌ది పైచేయిలా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో 16 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. టోర్నీలో ఢిల్లీపై ముంబై చేసిన అత్యధిక స్కోరు 218 పరుగులు కాగా.. ముంబైపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 213 పరుగులు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండు లీగ్ దశ మ్యాచ్‌లుకాగా.. మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు. ఇందులో ఫైనల్ కూడా ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లకిగానూ మూడు సార్లు ఛేదనకు దిగే ఢిల్లీపై ముంబై గెలుపొందింది.

తుది జట్లు:
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్‌మెయర్, లలిత్ యాదవ్, ఆర్ అశ్విన్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, అవెష్ ఖాన్.

ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Tuesday, April 20, 2021, 19:16 [IST]
Other articles published on Apr 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+