PKBS vs SRH: కేన్ రాకతో మా బలం పెరిగింది.. ఇక కొత్తగా ప్రారంభిస్తాం: వార్నర్‌

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొంది. పంజాబ్‌ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్‌ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌ (37; 37 బంతుల్లో 3x4, 1x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్‌; 56 బంతుల్లో 3x4, 3x6), కేన్‌ విలియమ్సన్‌ (16 నాటౌట్‌; 19 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ విజయం అనంతరం‌ ప్రెజంటేషన్ సందర్భంగా ‌సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ మాట్లాడాడు. 'ఈ విజయం పట్ల చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్‌ విజయంలో మా బౌలర్ల పాత్ర ఎంతో ఉంది. నిజంగా వారి అద్భత బౌలింగ్‌తో పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేసినప్పుడే.. మ్యాచ్‌ మా చేతుల్లోకి వచ్చేసింది. నేను కడదాకా ఉంటే బాగుండు అనిపించింది. ఆ షాట్ ఆడుండకూడదు. కానీ అలా జరిగిపోయింది. ఆటలో ఇవ్వని సహజమే' అని వార్నర్ అన్నాడు.

'కేన్ విలియమ్సన్‌ తుది జట్టుతో చేరడంతో మాలో బలం పెరిగింది. అతని రాక.. మాకు విజయంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఔటైన తర్వాత బెయిర్‌ స్టోకు అండగా నిలిచిన కేన్‌ యాంకర్‌ పాత్రను సమర్థంగా పోషించాడు. అతడు స్పిన్‌కు వ్యతిరేకంగా బాగా ఆడగలడు. ఆట ప్రణాళికలు తెలుసు. మిడిల్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేయగలడు. అభిషేక్‌ శర్మ యువకుడు. అతడి బౌలింగ్‌ నాకు బాగా నచ్చింది. బాగా బౌలింగ్ చేయాలని అతడికి చెప్పాం. మా నమ్మకాన్ని నిలబెట్టాడు. మాకు ఇక్కడ ఇంకో మ్యాచ్ ఉంది. పిచ్ స్పందించే తీరుపై ఆశ్చర్యపోనవసరం లేదు. మేము బాగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభిస్తాం. ఇదే మా గేమ్ ప్లాన్' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ... 'చెన్నైలో మాకు ఇది మొదటి మ్యాచ్‌. పిచ్‌ పరిస్థితి మాకు కొత్త కావడంతో ఇలా ఆడుతామని ఊహించలేదు. మేము చేసిన స్కోరుకు అదనంగా మరో 10-15 పరుగులు జతచేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సన్‌రైజర్స్‌ గెలుపుకు వారి బౌలింగ్‌ ఒక కారణం . ఎందుకంటే వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడడంతో పిచ్‌పై అవగాహన వచ్చేసింది. ఇక మా బ్యాటింగ్‌ ఈరోజు అనుకున్నంత బాలేదు. చేసింది తక్కువ స్కోరైనా మా బౌలర్ల ప్రదర్శన తక్కువ చేయలేం. వరుసగా మూడు మ్యాచ్‌లు పరాజయం చెందడంతో ఒత్తిడి ఉంది. రానున్న మ్యాచ్‌లపై దాని ప్రభావం లేకుండా చూసుకుంటాం' అని తెలిపాడు.

KKR vs CSK: డుప్లెసిస్ విధ్వంసం‌.. గైక్వాడ్‌ హాఫ్ సెంచరీ! మెరిసిన ధోనీ.. కోల్‌కతా లక్ష్యం 221!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 21, 2021, 23:05 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X