DC vs SRH: డేవిడ్ వార్నర్.. ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలేయ్! ఇక టిక్‌టాక్ కెరీర్‌పై దృష్టి పెట్టు.. పైసలే పైసలు!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఖాతా తెరవకముందే ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే వేసిన తొలి ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు.

6 మ్యాచ్‌ల్లో 191 పరుగులే:
భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశ మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 191 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో వార్నర్ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యున్ని చేస్తూ కెప్టెన్సీపై వేటు వేసింది. అంతేకాకుండా తుది జట్టు నుంచి కూడా తప్పించింది. ఇక కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ పోయిన తర్వాత ఏకైక మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు దక్కలేదు. 12వ ఆటగాడిగా ఎస్ఆర్‌ఎచ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు.
ప్రాక్టీస్‌లో సిక్సుల వర్షం:
ఎస్ఆర్‌ఎచ్ జట్టులో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు డేవిడ్ వార్నర్ దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. కెప్టెన్సీ దూరమవడంతో హాట్ అయ్యాడని, టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఐపీఎల్ ఆడడని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తాను ఐపీఎల్ 14వ సీజన్ మిగతా మ్యాచులు కూడా ఆడతానని వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అందరికంటే ముందుగానే యూఏఈ చేరుకొని సాధన చేశాడు. ఈ క్రమంలో నెట్‌లో చెమటోడ్చాడు. ప్రతి బంతిని బాదుతూ కనిపించాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా భారీ షాట్లు ఆడాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లతో వార్నర్ అలరించాడు. ఇక ముందుకొచ్చి మరీ భారీ సిక్సులు బాదాడు. దాంతో వార్నర్ మలి దశలో ఆకట్టుకుంటారని అందరూ భావించారు.
వార్నర్.. ఇదే చివరి మ్యాచ్:
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. అన్రిచ్ నోర్జే వేసిన అద్భుత బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాన్స్ నిరాశ చెందారు. సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీమ్స్ ట్రెండ్ చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు. 'ప్రాక్టీస్‌లో సిక్సుల వర్షం.. మ్యాచులో మాత్రం డకౌట్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వార్నర్.. నీవల్ల ఏం ఉపయోగం లేదు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలేయ్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలేసి.. టిక్‌టాక్ కెరీర్‌పై దృష్టి పెట్టు. పైసలే పైసలు' అని ఇంకొకరు ట్వీటారు. 'అప్పుడు కెప్టెన్‌గా..ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా ఏం లాభం లేదు', 'వార్నర్.. ఇదే చివరి మ్యాచ్ నీకు' అని కామెంట్లు చేస్తున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, అబ్ధుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications