ఫుల్ పీపీఈ కిట్స్: కళ్లు మాత్రమే కనిపించేలా: ఆ ఇద్దరు ఐపీఎల్ సూపర్ స్టార్స్ ఎవరో చెప్పగలరా?

ముంబై: దేశం మొత్తాన్నీ కరోనా భయం ఆవరించింది. జనం ఉసురు తీస్తోన్న కరోనా వైరస్ అంటే అందరిలోనూ తెలియని భయం ఆవహించింది. ఇదివరకటితో పోల్చుకుంటే.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కోట్టే దెబ్బ అల్లాటప్పాగా ఉండట్లేదు. వేలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారు. లక్షలాది మంది ఈ మహమ్మారిన పడి, ఆసుపత్రుల పాలయ్యారు. దేశవ్యాప్తంగా 29 లక్షల వరకు కరోనా వైరస్ యాక్టివ్ కేసులు దేశంలో రికార్డయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని లక్షల మందికి ఒకేసారి వైద్యాన్ని అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు.. ఆక్సిజన్ అందుబాటులో ఉండట్లేదు.

వారిని చూసైనా..
ఈ పరిణామాల మధ్య ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించాలని, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలంటూ సెలెబ్రిటీలు తమ అభిమానులకు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సందేశాలను ఇస్తున్నారు. మనదేశంలో కోట్లాదిమంది ఆరాధించే, అభిమానించే క్రికెటర్లు కూడా తమవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి తాము స్వయంగా ముందుజాగ్రత్తలను తీసుకోవడమే కాకుండా.. వాటిని పాటించేలా తమ అభిమానుల్లో స్ఫూర్తినింపే ప్రయత్నం చేస్తున్నారు. తమను చూసైనా మార్పు తెచ్చుకుంటారనేది వారి ఆలోచన.
ఫుల్ పీపీఈ కిట్స్‌తో
బ్లూ కలర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్స్ ధరించి, విమాన ప్రయాణం చేస్తోన్నది మరెవరోకాదు.. మన కేన్ మామ.. డేవిడ్ భాయ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ ఒంటినిండా పీపీఈ కిట్లను ధరించి..విమాన ప్రయాణి చేస్తోన్న సమయంలో తీసిన ఫొటో అది. దాన్ని కేన్ విలియమ్సన్.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. స్టే సేఫ్ అంటూ దానికి కామెంట్స్ యాడ్ చేశాడు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు కేన్ విలియమ్సన్.

వార్నర్ టీమ్.. ఛలో ఢిల్లీ..
ఐపీఎల్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తరువాతి మ్యాచ్‌లో తనకంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరుగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం ఈ బిగ్ బ్యాటిల్‌కు వేదిక కానుంది. చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరింది సన్‌రైజర్స్ జట్టు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఫుల్‌గా పీపీఈ కిట్లను ధరించి కనిపించారు. తోటి క్రికెటర్ జగదీషన్ సుచిత్ వారిని ఫొటో తీశాడు. ఆ వెంటనే దాన్ని విలియమ్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

తనకంటే బలమైన ప్రత్యర్థితో ఫైట్
ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూసింది వార్నర్ అండ్ హిస్ టీమ్. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ అత్యంత కీలకమైనది. టోర్నమెంట్‌లో ముందుకు సాగాలీ అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టు ధోనీ సేనను ఓడించి తీరక తప్పదు. లేదంటే ప్లే ఆఫ్‌కు చేరడం కనాకష్టంగా మారుతుంది. హైదరాబాద్‌తో పోల్చుకుంటే చెన్నైటీమ్ పరిస్థితి ఎన్నో రెట్లు బెటర్. తొలి మ్యాచ్‌లో మాత్రమే ఓడిన ఆ జట్టు నాలుగింట్లో గెలిచింది. అప్రతిహతంగా తన జైత్రయాత్రను సాగిస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications