
2021లో మాత్రమే:
ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయిన విషయం తెలిసిందే. ఆడిన 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే.. 2021లోనే అతి తక్కువ పరుగులు సాధించాడు. 2014 నుంచి 2020 వరకు 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తూ వచ్చాడు. కానీ 2021లో మాత్రం ఫాంలో లేక తంటాలు పడ్డాడు. ప్రతీ ఆటగాడికి ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మాత్రం అతడి పట్ల కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఆపై ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటివ్వలేదు. అంతేకాకుండా కనీసం డగౌట్లో (డగౌట్లో ఉండేందుకు జట్టులోని 18 మందికి స్థానం ఉంటుంది) కూడా అతడికి చోటివ్వలేదు. ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన గత మ్యాచులో అయితే వార్నర్ ఓ సాధారణ ప్రేక్షకుడిలా మ్యాచ్ చూశాడు.

మళ్లీ స్టేడియంలోకి రాను:
వచ్చే సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆరెంజ్ ఆర్మీకి దూరమవుతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. తాజాగా వార్నర్ చేసిన ఓ ట్వీట్ కూడా అందుకు బలం చేకూర్చింది. 'దురదృష్టవశాత్తు నేను మళ్లీ స్టేడియంలోకి రాను. కానీ సన్‌రైజర్స్ జట్టుకు మద్దతు మాత్రం ఇస్తూనే ఉండండి' అని వార్నర్ పేర్కొవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో సన్‌రైజర్స్ నుంచి తప్పుకుని వేరే ప్రాంచైజీకి వెళ్తానని వార్నర్ చెప్పకనే చెప్పాడు. 2016లో సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలిపిన వార్నర్‌కి చివరి మ్యాచ్‌లోనైనా అవకాశం ఇచ్చి వీడ్కోలు పలకాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరారు. దాంతో శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో వార్నర్ ఆడుతాడని అందరూ ఊహించారు. కానీ అదేమీ జరగలేదు.

అస్సలు పడటం లేదా:
అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. గాయం కారణంగా ఈ మ్యాచుకు సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. దాంతో ఇన్నిరోజులు బెంచుకే పరిమితమైన మనీష్ పాండే.. ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలు అందుకున్నాడు. దాంతో డేవిడ్ వార్నర్‌కి నిరాశే ఎదురైంది. టాస్ సమయంలో విలియమ్సన్ బదులుగా మనీష్ మైదానంలోకి రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తుది జట్టులో వార్నర్‌కి చోటు లేకపోవడంతో.. వార్నర్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు అస్సలు పడటం లేదని మరోసారి నిరూపితమైంది. ఇదే విషయమై ఫాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 'వార్నర్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు అస్సలు పడటం లేదా'? అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మనీశ్ పాండేను కెప్టెన్ చేశారు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వార్నర్ కెప్టెన్సీలో టైటిల్:
వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. ఓడిపోయే మ్యాచులను కూడా డేవిడ్ భాయ్ ఒంటిచేత్తో గెలిపించాడు. అద్భుత ఓపెనింగ్ ఇచ్చి ఎన్నోసార్లు భారీ స్కోర్లు అందించారు. పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా.. జట్టులో మంచి సమతూకం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించాడు. 2012లో డెక్కన్ చార్జర్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్ సామి, శిఖర్ ధావన్, కామెరున్ వైట్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో వార్నర్ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత సన్‌రైజర్స్ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ టైటిల్‌ను సన్‌రైజర్స్ అందుకుంది.


Click it and Unblock the Notifications
