DC vs SRH: శివాలెత్తిన డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు జాగ్రత్త మరి!! (వీడియో)

హైదరాబాద్: యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు ఆరంభం అయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచులు ముగియగా.. ఈ రోజు దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక దుబాయ్ మైదానంలోనే బుధవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌ఎచ్), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ప్లేయర్స్ ముమ్మర సాధన చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్‌ఎచ్ ప్లేయర్స్. ఎందుకంటే ప్రతి మ్యాచ్ వారికీ ముఖ్యమే. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ నెట్‌లో చెమటోడ్చాడు.

PBKS vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. గేల్ ఔట్! హిట్టర్‌లకు చోటిచ్చిన రాజస్థాన్!! PBKS vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. గేల్ ఔట్! హిట్టర్‌లకు చోటిచ్చిన రాజస్థాన్!!

భారీ సిక్సులు బాదుతూ:

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ రోజు దుబాయ్ మైదానంలో సాధన చేసింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ నెట్‌లో చెమటోడ్చాడు. ప్రతి బంతిని బాదుతూ కనిపించాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా భారీ షాట్లు ఆడాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లతో వార్నర్ అలరించాడు. ఇక ముందుకొచ్చి మరీ భారీ సిక్సులు బాదాడు. అందులో కొన్ని మైదానం బయట పడ్డాయి. ఎస్ఆర్‌ఎచ్ కోచ్ వార్నర్ బ్యాటింగ్‌ను దగ్గరుండి మరి పరీక్షించాడు. వార్నర్ సాధనకు సంబందించిన వీడియోను కొద్దిసేపటి క్రితం ఎస్ఆర్‌ఎచ్ ప్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు జాగ్రత్త మరి' అంటూ ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

6 మ్యాచ్‌ల్లో 191 పరుగులే:

6 మ్యాచ్‌ల్లో 191 పరుగులే:

భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొదటి దశ మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 191 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించింది. దాంతో వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యున్ని చేస్తూ కెప్టెన్సీపై వేటు వేసింది. అంతేకాకుండా తుది జట్టు నుంచి తప్పించింది. ఇక కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ పోయిన తర్వాత ఏకైక మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో వార్నర్ ఆడలేదు. 12వ ఆటగాడిగా ఎస్ఆర్‌ఎచ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు.

వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయం:

వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయం:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు డేవిడ్ వార్నర్‌ దూరంగా ఉంటాడని మొదటగా వార్తలు వచ్చాయి. కెప్టెన్సీ పోవడంతో హట్ అయ్యాడని, టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఐపీఎల్ ఆడడని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్‌ తాను ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగతా మ్యాచులు కూడా ఆడతానని క్లారిటీ ఇచ్చేశాడు. అందరికంటే ముందుగానే యూఏఈ చేరుకొని సాధన చేశాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిరిస్టో.. రెండో దశకు దూరమవడంతో వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయం అయింది. వార్నర్‌ ఐపీఎల్‌ ఆడనున్న నేపథ్యంలో హైదరాబాద్ అభిమానుల్లో జోష్‌ పెరిగింది. ఈసారైనా డేవిడ్ భాయ్ అలరిస్తాడేమో చూడాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):

డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 20:20 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X