ఐపీఎల్‌లో ఆటకు విలువ లేదు.. డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ! పీఎస్‌ఎల్‌, ఎల్‌పీఎల్‌ బెటర్: స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు

#IPL2021: PSL More Rewarding Than IPL, Cricket Forgotten At IPL- Dale Steyn | Oneindia Telugu

జోహ‌నెస్‌బ‌ర్గ్‌: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభమైన నాటినుంచి గత సీజన్‌ వరకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ లీగ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు అక్కడ విలువ లేదన్నాడు. ఐపీఎల్‌ కంటే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2021 ఆడకూడదని స్టెయిన్‌ నిర్ణ‌యించుకున్న విషయం తెలిసిందే.

డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ

డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడేందుకు డేల్‌ స్టెయిన్‌ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ 'క్రికెట్ పాకిస్తాన్‌'తో స్టెయిన్‌ మాట్లాడుతూ... 'పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్‌ విషయానికొస్తే.. అక్కడ పెద్దపెద్ద జట్లుంటాయి. పేరున్న ఆటగాళ్లు ఉంటారు. ఎవరికెంత ఇస్తున్నారు అనే దానిపైనే చర్చ సాగుతుంది. అలాంటి స్థితిలో క్రికెట్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందుకే ఒక ఆటగాడిగా ఐపీఎల్‌తో పోలిస్తే నాకు పీఎస్‌ఎల్, లంక లీగ్‌లలో ఆడటం ఎక్కువ సంతృప్తినిస్తుంది' అని అన్నాడు.

ఐపీఎల్‌లో ఇలాంటివి కనిపించవు

ఐపీఎల్‌లో ఇలాంటివి కనిపించవు

'పీఎస్ఎల్‌, ఎల్‌పీఎల్‌‌లో ఆడిన‌ప్పుడు క్రికెట్‌కే ప్రాముఖ్య‌త ఉంటుంది. పీఎస్ఎల్ కోసం ఇక్క‌డికి వ‌చ్చి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎంతో మంది నా గురించి, ఆట గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇలాంటివి కనిపించవు. ఎంతకు అమ్ముడుపోయావన్నదే అక్కడ ప్రధాన చర్చ. అలాంటి వాటికి ఈ ఏడాది దూరంగా ఉండాలని అనుకున్నా' అని దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ అన‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌ చాలా ఎక్కువ రోజులు సాగుతుందని, తనకంటూ కొంత సమయం కూడా కావాలని స్టెయిన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గత రెండు సీజన్లుగా రాణించలేదు

గత రెండు సీజన్లుగా రాణించలేదు

ఐపీఎల్ లీగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్‌ జట్ల తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన డేల్‌ స్టెయిన్‌ 97 వికెట్లు తీశాడు. కనీసం 50కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతి తక్కువ ఎకానమీ (6.91) ఉన్న పేసర్‌ కూడా స్టెయిన్నే. గ‌త రెండు, మూడు సీజ‌న్ల‌లో ఐపీఎల్లో స్టెయిన్‌కు పెద్ద‌గా ఆడే అవ‌కాశం రాలేదు. మూడు సీజ‌న్లు క‌లిపి కేవ‌లం 12 మ్యాచ్‌లే ఆడాడు. గ‌త సీజ‌న్‌లో అత‌డు బెంగ‌ళూరు టీమ్‌లో ఉన్నాడు. గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన స్టెయిన్..‌ ఈసారి ముందే తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

నెటజిన్ల ఆగ్రహం

నెటజిన్ల ఆగ్రహం

పీఎస్‌ఎల్‌ను మెచ్చుకొని ఐపీఎల్‌ను ఇలా అవమానించడంపై నెటజిన్లు డేల్‌ స్టెయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఐపీఎల్ జట్లలో ప్లేయింగ్ 11లోకి నేను వెళ్లలేకపోతున్నా. ఆర్‌సీబీ కూడా నన్ను బెంచికే పరిమితం చేసింది' ఇదే స్టెయిన్ అన్నది అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. 'అత్యున్నత స్థాయిలో పోటీ పడలేకపోతే ఇలానే విమర్శించాలి' అని మరో నెటిజన్ అన్నాడు. స్టెయిన్ దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.

India vs England: అక్షర్ పటేల్.. ఆడింది చాలు! ఇక సెలవులపై వెళ్లిపో: గ్రేమ్ స్వాన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, March 3, 2021, 8:01 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X