For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: నా వాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి! ఐపీఎల్‌పై స్టెయిన్‌ యూ టర్న్!

IPL 2021: Dale Steyn apologises for his comments on IPL
#DaleSteyn Apologises For His Comments On IPL | Oneindia Telugu

కరాచీ: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)పై దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు విలువ లేదన్నాడు. ఐపీఎల్‌ కంటే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు. అయితే స్టెయిన్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో బుధవారం తనపై వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా పేసర్‌ స్పందించాడు.

'ఐపీఎల్‌తోనే నా కెరీర్‌ అద్భుతంగా సాగిందని నేను ఎప్పుడు చెప్పను. ఇతర ఆటగాళ్లకు కూడా. నా వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏ లీగ్‌లను కించపరచడం, అవమానించడం లేదా పోల్చడం చేయలేదు. నా వ్యాఖ్యలను సోషల్‌ మీడియా తప్పుగా రాసుకొచ్చింది. ఐపీఎల్‌ను చులకన చేసి మాట్లాడి ఉంటే క్షమించండి. పీఎస్‌ఎల్‌, ఎల్‌పీఎల్‌ లాంటి లీగ్‌లతో ఐపీఎల్‌ను నేనెప్పుడు పోల్చలేదు. ఆటలో దేని ప్రాధాన్యం దానికే ఉంటుంది' అని డేల్‌ స్టెయిన్‌ అన్నాడు.

అంతేకాదు వేలానికి ముందు జనవరిలో చేసిన ఒక ట్వీట్‌ను కూడా స్టెయిన్‌ మరోసారి రీట్వీట్‌ చేశాడు. 'ఈసారి ఐపీఎల్‌ల్‌కు నేను అందుబాటులో ఉండడం లేదు. గతేడాది ప్రాతినిధ్యం వహించిన బెంగళూరు యాజమాన్యానికి కూడా ఈ విషయం చెప్పాను. అంతేగాక ఈసారి వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా. ఐపీఎల్‌లో ఏ టీమ్‌కు ఆడకూడదని భావించా. కేవలం ఐపీఎల్‌ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ ఆర్‌సీబీ. అయితే నేను ఇంకా ఆటకు గుడ్‌బై చెప్పలేదు' అని స్టెయిన్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఐపీఎల్ లీగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్‌ జట్ల తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన డేల్‌ స్టెయిన్‌ 97 వికెట్లు తీశాడు. కనీసం 50కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతి తక్కువ ఎకానమీ (6.91) ఉన్న పేసర్‌ కూడా స్టెయిన్నే. గ‌త రెండు, మూడు సీజ‌న్ల‌లో ఐపీఎల్లో స్టెయిన్‌కు పెద్ద‌గా ఆడే అవ‌కాశం రాలేదు. మూడు సీజ‌న్లు క‌లిపి కేవ‌లం 12 మ్యాచ్‌లే ఆడాడు. గ‌త సీజ‌న్‌లో అత‌డు బెంగ‌ళూరు టీమ్‌లో ఉన్నాడు. గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన స్టెయిన్..‌ ఈసారి ముందే తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Wednesday, March 3, 2021, 15:52 [IST]
Other articles published on Mar 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+