For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: ఒకే ఓవ‌ర్‌లో 37 ప‌రుగులు.. రవీంద్ర జడేజా విధ్వంసం! ఈ వీడియో చూడాల్సిందే!

IPL 2021, CSK vs RCB: Ravindra Jadeja hits 37 runs in final over, video goes viral
IPL 2021 : Jadeja 37 Runs- Most Expensive Over In History | Twitter Salutes || Oneindia Telugu

ముంబై: ఆదివారం వాంఖడే మైదానంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జరిగిన మ్యాచులో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ ర‌వీంద్ర జ‌డేజా విధ్వంసం సృష్టించాడు. బెంగళూరు పేసర్ హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 'సర్' జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. జ‌డేజా కేవ‌లం 28 బంతుల్లో 62 ప‌రుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్ చేసి మూడు వికెట్లు (3/13) కూడా పడగొట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హర్షల్‌ పటేల్‌ వేసిన మొదటి బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌గా మలిచిన జడేజా.. రెండో బంతిని కవర్స్‌ దిశగా ఇంకో సిక్స్‌ బాదాడు. హర్షల్‌ వేసిన మూడో బంతి నోబాల్‌ కాగా.. దానిని లాంగాన్‌ మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత వేసిన ప్రీ హిట్‌ను కూడా జడ్డూ సిక్సర్‌గా మలిచి వరుసగా నాలుగు బంతులను నాలుగు సిక్స్‌లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. అయితే ఓవర్‌ నాలుగో బంతిని సిక్స్‌ కొట్టడానికి ప్రయత్నించగా.. రెండు పరుగులు సాధించాడు. ఇక ఐదో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా మరోసారి సిక్స్‌ కొట్టిన జడేజా ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచాడు. జడేజా విధ్వంసంకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీకు కూడా వీడియో చూసి ఆనందించండి.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు న‌మోదు చేసిన రికార్డును ర‌వీంద్ర జ‌డేజా అందుకున్నాడు. 2011లో క్రిస్ గేల్ న‌మోదు చేసిన రికార్డును జ‌డేజా స‌మం చేశాడు. క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ 37 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 36 రన్స్ పిండుకున్నాడు. ఇందులో కూడా ఒక నోబాల్ ఉంది. ఇక సురేష్ రైనా ఒకే ఓవర్‌లో 32 పరుగులు పిండుకున్నాడు. అవానా బౌలింగ్లో 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో రైనా ఈ ఘనతను అందుకున్నాడు.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై 69 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. జడేజా బ్యాట్‌, బంతితో రాణించి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 192 పరుగుల భారీ ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది. దేవదత్‌ పడిక్కల్‌ (34: 15 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ సేన టోర్నీలో తొలిసారి ఓటమిపాలైంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఆరంభంలో ఫాఫ్ డుప్లెసిస్‌ (50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో జడేజా (62 నాటౌట్‌: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) వీరవిహారం చేశారు.

Story first published: Sunday, April 25, 2021, 20:42 [IST]
Other articles published on Apr 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+