CSK vs MI:నేటి నుంచే ఐపీఎల్‌ 2021 రెండో దశ షురూ.. ధోనీ vs రోహిత్! పిచ్‌ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 రెండో దేశ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుంది. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా సాగే ఈ మ్యాచ్‌తో రెండో దశ సీజన్‌కు గొప్ప ఆరంభం ఖాయం.

వచ్చే నెలలో యూఏఈలోనే టీ20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభం కావాల్సి ఉండగా.. దానికంటే ముందు అభిమానులకు విందు భోజనం వడ్డించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ఇప్పటికే జట్లన్నీ యూఏఈ చేరుకుని ముమ్మర సాధన చేశాయి. పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న ఈ టోర్నీలో మెరిసి.. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని ప్లేయర్లు భావిస్తున్నారు.

27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లు

27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లు

ఐపీఎల్‌ 2021లో మే 2న అహ్మదాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. మే 4న కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. కేకేఆర్ టీమ్‌లోని వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఆ మ్యాచ్‌ను షెడ్యూల్‌ నుంచి తప్పించి తర్వాతి రోజు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.

ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్‌ ఉధృతంగా కొనసాగడంతో భారత్‌లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో ఎన్నో చర్చల అనంతరం భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్‌ విడుదల చేసింది. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి.

అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం.

తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనదే విజయం

తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనదే విజయం

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లయిన.. ముంబై, చెన్నై మధ్య దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే అయిదు సార్లు టైటిల్‌ గెలుచుకున్న ముంబై ఓ వైపు.. మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై మరో వైపు. అన్ని విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్లలో విజయం ఎవరిదో అన్న ఆసక్తి నెలకొంది.

సీజన్‌ తొలి దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన చెన్నై పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ముంబై నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఆ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్‌ (34 బంతుల్లో 87) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

మిడిలార్డర్ సమస్య

మిడిలార్డర్ సమస్య

నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. తొలి దశలో వెనకపడిన రోహిత్ సేన మలి దశలో సత్తాచాటాల్సిన అవసరం ఎంతో ఉంది. ముంబై జట్టును ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యలు మిడిలార్డర్, పవర్​ప్లే బౌలింగ్ గణాంకాలు. ఇవి సరిదిద్దుకుంటే సరిపోతుంది. ముంబైకి రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా,జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌ కీలకం కానున్నారు.

అయితే టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ముంబై పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ బౌలింగ్‌లో మెరువాలని భారత అభిమానులు ఆశిస్తుంటే.. సూర్యకుమార్‌, ఇషాన్‌, చహర్‌ తమ ఎంపికకు న్యాయం చేయాలని ఉత్సుకతతో ఉన్నారు.

చెన్నైకి గాయాల బెడద

చెన్నైకి గాయాల బెడద

2020లో యూఏఈలోనే జరిగిన లీగ్‌లో దారుణ ప్రదర్శన తర్వాత చెన్నైకి ఈసారి విన్నింగ్‌ కాంబినేషన్‌ కుదిరింది. కానీ తాజాగా పలువురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తొలి దశలో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్, ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్ అదరగొట్టారు. అయితే కరన్ ఇంకా క్వారంటైన్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. స్టార్‌ ఓపెనర్‌ ఫాఫ్ డుప్లెసిస్ గాయం ఆందోళన కలిగిస్తోంది. అతడి స్థానాన్ని రాబిన్ ఊతప్ప భర్తీ చేసే చాన్సుంది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌ చేయడం సందేహమే.

ఇక రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ బౌలింగ్‌.. బ్యాటింగ్‌తో జట్టుకు కీలక విజయాలందించారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, తెలుగు తేజం అంబటి రాయుడు కూడా ఆశించిన రీతిలో బ్యాట్లు ఝుళిపిస్తే జట్టుకు ఎదురుండదు. ఇందులో గెలిస్తే పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళుతుంది.

IPL 2021: 'విరాట్ కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్‌ టైటిల్ గెలవాలి.. కానీ ఈసారి కూడా కష్టమే'

హెడ్ టు హెడ్ రికార్డులు

హెడ్ టు హెడ్ రికార్డులు

ముంబై, చెన్నై జట్లు ఇప్పటి వరకూ 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందగా.. మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. గత కొంత కాలంగా చెన్నైపై ముంబై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చెన్నై గెలవడం కష్టంగా మారింది. ఓవరాల్‌గా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. మరి దుబాయ్‌ వేదికగా జరుగనున్న పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

పిచ్‌ రిపోర్ట్

పిచ్‌ రిపోర్ట్

దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రత ఆటగాళ్లకు సవాలు విసరనుంది. మ్యాచ్ రాత్రి కాబట్టి దుబాయ్ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు. అయితే మంచు ప్రభావం మాత్రం ఉండనుంది. మొదట్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌.. ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది. ఇక్కడ 93 మ్యాచులు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు 54 మ్యాచులు గెలిచాయి. ఈ వేదికలో అత్యధిక మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 219/2 కాగా.. అత్యల్ప స్కోర్ 59. 203 పరుగులను కూడా ఇక్కడ ఛేజ్ చేశారు.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌, అలీ, రైనా, రాయుడు, జడేజా, బ్రావో, ధోనీ , శార్దూల్‌, చహర్‌, తాహిర్‌, హేజిల్‌వుడ్‌.

ముంబై: రోహిత్‌, డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కృనాల్‌, మిల్నె/కౌల్టర్‌నైల్‌, జయంత్‌/రాహుల్‌, బౌల్ట్‌, బుమ్రా.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 19, 2021, 7:59 [IST]
Other articles published on Sep 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X