CSK vs DC: ఒకే ఓవర్లో 23 పరుగులు.. అన్నను ఉతికారేసిన తమ్ముడు!!

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. చెన్నై ఆల్‌రౌండర్ శామ్ కరన్ (34;15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. ఢిల్లీ తరఫున ఆడుతున్న తన అన్న టామ్ కరన్ బౌలింగ్‌ను శామ్ ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రవీంద్ర జడేజా కూడా తడికి జతకలవడంతో టామ్ మొత్తంగా ఆ ఓవర్లో 23 పరుగులు సమర్పించుకున్నాడు.
టామ్ కరన్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతికి జడేజా ఫోర్ బాధగా.. రెండో బంతికి సింగల్ తీశాడు. దీంతో మూడో బంతిని శామ్ కరన్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. శామ్ మూడో బంతిని వైడ్ వేశాడు. మూడు, నాలుగు బంతుల్లో శామ్ భారీ సిక్సులు బాదాడు. ఇక ఐదవ బంతికి బౌండరీ బాదిన శామ్.. చివరి బంతికి సింగల్ తీశాడు. శామ్, జడేజా కలిసి 19వ ఓవర్లో 23 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి తమ్ముడు.. అన్నను ఉతికారేశాడు.
మ్యాచుకు ముందు శామ్ కరన్ మాట్లాడుతూ.. ఈ రోజు తన తల్లి చాలా ఒత్తిడికి గురవుతుందని తెలిపాడు. 'కొన్ని వారాల క్రితం భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. ఐపీఎల్ 2021 కోసం కొంత సమయం దొరికింది. అయితే బయో బబుల్ మాత్రం కఠినంగా ఉంది. కానీ ఇది ఓ కొత్త ప్రపంచం. ఈ రోజు రాత్రి మా అమ్మ చాలా ఒత్తిడికి గురవుతుందని తెలుసు. ఎందుకంటే సోదరులిద్దరం ప్రత్యర్థులుగా తలపడుతున్నాం కాబట్టి. ఎవరిపై ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారని అమ్మ కాస్త బయపడుతుంటుంది' అని శామ్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications