Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే ఫైర్..అదే జోష్: ధోనీ మాస్ అంతే: ఢిల్లీ బౌలర్లకు చుక్కలే

IPL 2021, CSK vs DC: MS Dhoni Goes Big In Wankhede Nets
#IPL2021,CSK VS DC : Helicopter Shot సహా అన్ని షాట్లు ఆడేసిన Dhoni, సమవుజ్జీగా #RishabhPant

ముంబై: ఇంకొన్ని గంటల్లో.. చెన్నై సూపర్ కింగ్స్ క్రీజ్‌లో దిగబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సురేష్ రైనా ఆడటం దాదాపు ఖాయమైనట్టే. వ్యక్తిగత కారణాల వల్ల గత ఏడాది ఐపీఎల్‌కు దూరమైన అతను ఈ సారి జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రిషబ్ పంత్ కేప్టెన్సీ, స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం.

ఈ మ్యాచ్‌ కోసం ధనాధన్ ధోనీ.. నెట్స్‌లో కఠోరంగా శ్రమించాడు. సుదీర్ఘకాలం పాటు నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. క్రికెట్‌లోని అన్ని రకాల షాట్లను ధోనీ సునాయాసంగా ఆడాడు. తనకు మాత్రమే అలవాటైన హెలికాప్టర్ షాట్‌ను నాలుగైదు సార్లు సక్సెస్‌ఫుల్‌గా ట్రై చేశాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, స్క్వేర్ కట్, లాంగ్ ఆన్, స్ట్రెయి్ డ్రైవ్.. ఇలా క్రికెట్ బుక్‌లో ఉండే అన్ని షాట్లను ధోనీ అలవోకగా ఆడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ధోనీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం దీని ప్రత్యేకత.

ఐపీఎల్‌ అన్ని సీజన్లలో ఇప్పటిదాకా ధోనీ 204 మ్యాచ్‌లను ఆడాడు. 4,632 పరుగులు చేశాడు. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ టోర్నమెంట్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు పీడకలను మిగిల్చింది. ధోనీ సైతం తన స్థాయికి తగ్గట్టుగా ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్‌లను ఆడిన అతను చేసింది 200 పరుగులే. ఒక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయలెపోయాడు. స్ట్రైక్ రేట్ 116.27తో ఫర్వాలేదనిపించింది. ఐపీఎల్ 2020 చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ ఈ సారి జట్టును టాప్ పొజీషన్‌లో నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు ధోనీ.

ధోనీతో పాటు ఈ సారి సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శామ్ కుర్రమ్ వంటి ఆల్‌రౌండర్లతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ సారథ్యంలో సమవుజ్జీగా కనిపిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్‌ను ధోనీ సేన ఎలా ఎదుర్కొంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. స్టీవ్ స్మిత్ రాకతో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ లైనప్ మరంత బలోపేతమైందనడంలో సందేహాలు అక్కర్లేదు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్ వంటి బ్యాట్స్‌మెన్లతో పాటు కగిసో రబడ, అక్షర్ పటేల్‌లతో బౌలింగ్ వింగ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది.

Story first published: Saturday, April 10, 2021, 13:00 [IST]
Other articles published on Apr 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+