KKR vs CSK: 4వికెట్లతో చహర్ దెబ్బకొట్టినా.. చెన్నైని వణికించిన రసెల్, కమిన్స్! ధోనీసేనకు తృటిలో తప్పిన ఓటమి!

ముంబై: వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు తృటిలో ఓటమి తప్పింది. చెన్నై నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ధోనీసేన 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. పేసర్ దీపక్ చహర్ 4 వికెట్లతో కోల్‌కతాను ఆరంభంలోనే దెబ్బకొట్టినా.. స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (54: 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), పాట్ కమిన్స్ (66 నాటౌట్: 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చెన్నైని వణికించారు.
చివరలో వరుణ్ చక్రవర్తి (0), ప్రసిద్ క్రిష్ణ (0) రనౌట్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేదంటే కమిన్స్ ఊపుచూస్తే.. కోల్‌కతాకు విజయాన్ని అందించేవాడే. చెన్నై బౌలర్లలో చహర్ 4, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టాడు.

ఆదిలోనే చహర్ దెబ్బ
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. చెన్నైపేసర్ దీపక్ చహర్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేసిన చహర్ 4 వికెట్లు తీసి 16 పరుగులే ఇచ్చాడు. వైవిధ్యమైన బంతులు వేసి కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. చహర్‌తో పాటు ఆరో ఓవర్లో లుంగి ఎంగిడి ఒక వికెట్ తీయడంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 45/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్‌కతా తొలి ఐదుగురు బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా (9), శుభ్‌మన్ గిల్ (0), రాహుల్ త్రిపాఠి (8), ఇయాన్ మోర్గాన్ (7), సునీల్ నరైన్ (4) సింగిల్ డిజిట్‌కు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

వణికించిన కమిన్స్
కష్టాల్లో పడ్డ కోల్‌కతా జట్టును ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ (40; 24 బంతుల్లో 4x4, 2x6) ఆదుకున్నారు. ఆశలు వదులుకున్న స్థితిలో ఈ జోడీ బౌండరీలతో కదం తొక్కుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించారు. వీరి జోరుతో కోల్‌కతా 11 ఓవర్లలో 110 రన్స్ చేసింది. ఈ సమయంలో రసెల్ ఔట్ అయినా.. కమిన్స్, కార్తీక్ చెలరేగారు. భారీ షాట్ ఆడే క్రమంలో కార్తీక్ పెవిలియన్ చేరినా కోల్‌కతా స్కోర్ మాత్రం ఆగలేదు. కమిన్స్ సిక్సర్లతో విరుచుకుపడి చెన్నైకి దడ పుట్టించాడు. కరన్ వేసిన 16వ ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్ బాది మొత్తం 30 పరుగులు రాబట్టాడు. దాంతో ఒక్కసారిగా కోల్‌కతా శిబిరంలో రెక్కలు వచ్చాయి. అయితే టెయిలెండర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

దంచికొట్టిన ఫాఫ్, రుతురాజ్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (95 నాటౌట్: 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (64: 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) వీరవిహారం చేశారు. చెన్నై ఇన్నింగ్స్‌లో గైక్వాడ్, డుప్లెసిస్ ఆటే హైలైట్. కోల్‌కతా బౌలర్లను ఆటాడుకున్న ఈ జోడీ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో చెన్నై రన్ రేట్ ఎక్కడా 10కి తగ్గలేదు. ఇద్దరూ ఆద్యంతం కళ్లుచెదిరే బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై 12 ఓవెన్లలోనే100 పరుగుల మార్క్ అందుకుంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకు బలమైన పునాది వేశారు.

మెరిసిన అలీ, ధోనీ
ధాటిగా గైక్వాడ్, డుప్లెసిస్ అద్భుత హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయితే వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్‌లో రుతురాజ్.. కమిన్స్ చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై మొయిన్ అలీ (25; 12 బంతుల్లో 2x4, 2x6) కాసేపే క్రీజులో ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అతడు నరైన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. తర్వాత ధోనీ, డుప్లెసిస్ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడే క్రమంలో ధోనీ (17: 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. రసెల్ వేసిన ఓ ఆఫ్ స్టంప్ ఔట్ సైడ్ డెలివరీని బౌండరీ కొట్టబోగా.. షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న మోర్గాన్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. చివరి ఓవర్లో డూప్లెసిస్ 2 సిక్సులు బాదగా.. జడేజా (6: 1 బంతుల్లో) సిక్సుతో ఇన్నింగ్స్ ముగించాడు.
PKBS vs SRH: కేన్ రాకతో మా బలం పెరిగింది.. ఇక కొత్తగా ప్రారంభిస్తాం: వార్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications