చెన్నై విజయంలో కీలకపాత్ర
సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడి 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (7) బ్యాట్‌తో నిరాశపర్చినా.. బౌలింగ్‌లో సత్తాచాటి రెండు వికెట్లు తీశాడు. ధాటిగా ఆడుతున్న జోస్ బట్లర్ (49)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కీలక సమయంలో శివమ్ దూబేను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అంతేకాకుండా మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కత్‌ల క్యాచులను అందుకుని చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.

బంతే అతని చేతిలోకి వస్తుంది
రవీంద్ర జడేజా ఫీల్డింగ్ గురించి ఎనిమిదేళ్ల క్రితం (ఏప్రిల్ 9, 2013) చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ ట్వీట్‌లో ఏముందంటే..'సర్ జడేజా క్యాచ్ కోసం పరుగెత్తాడు. జడేజా ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని బంతే అతని చేతిలోకి వస్తుంది' అని మహీ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు, ధోనీ అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'ఎనిమిదేళ్ల తర్వాత ఆ వాస్తవం నిజమైంది' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 'బెస్ట్ ఫీల్డర్', 'వరల్డ్ సేఫెస్ట్ హాండ్స్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జడ్డూ వెరీ గుడ్డూ
గతరాత్రి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ ఇచ్చిన క్యాచ్ పట్టిన అనంతరం రవీంద్ర జడేజా సెలబ్రేట్ చేసుకున్న తీరు కూడా అభిమానులను ఆకర్షిస్తోంది. నాలుగు క్యాచ్‌లు పట్టినందుకు గుర్తుగా నాలుగు వేళ్లు చూపిస్తూ ఓమాదిరి సంబరాలు చేసుకున్నాడు. అరచేతిని సెల్‌ఫోన్ లాగా చెవుల వద్ద పెట్టి జడేజా వేసిన స్టెప్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన సీఎస్‌కే.. '2 వికెట్లు, 4 క్యాచ్‌లు.. జడ్డూ వెరీ గుడ్డూ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

జడేజాకు 2 వికెట్లు
సోమవారం జరిగిన పోరులో ధోనీసేన 45 పరుగుల తేడాతో రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డుప్లెసిస్ (33), రాయుడు (27) రాణించారు. రాయల్స్ బౌలర్లలో సకారియా 3, మోరిస్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. బట్లర్ (49) పోరాడాడు. చెన్నై బౌలర్లలో అలీ 3.. కరన్, జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications

CSK vs RR: నెమ్మదిగా ఆడటం జట్టుకు నష్టం కలిగిస్తుంది.. 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని హామీ ఇవ్వలేను: ధోనీ










