Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK Qualifer 1: 6 బంతుల్లో 18 రన్స్.. మునుపటి ఫామ్‌లోకి ఎంఎస్ ధోనీ! మహీ షాట్లు చూశారా (వీడియో)

IPL 2021: CSK captain MS Dhonis last two overs batting highlights vs DC in Qualifier 1

హైదరాబాద్: ఆదివారం దుబాయ్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. ఓ భారీ సిక్సర్, మూడు ఫోర్లతో అలరించడంతో ధోనీ అభిమానులు సంతోషంలో మునిగితేలారు. చివరి ఓవర్‌లో మహీ మూడు వరుస బౌండరీలు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహీ అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై ఫైనల్లోకి ప్రవేశించింది. ధోనీసేన ఫైనల్ చేరడం ఇది తోమ్మిదోసారి కావడం విశేషం. ప్రస్తుతం మహీ ధనాధన్ బ్యాటింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అంతకుముందు చెన్నై ఒక దశలో 111/1తో పటిష్ఠంగా నిలిచి సునాయాసంగా మ్యాచ్‌ను కైవసం చేసుకునేలా కనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చెన్నై ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న రాబిన్ ఉతప్ప (63; 44 బంతుల్లో 7×4, 2×6).. అప్పుడే క్రీజులోకి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (0), అంబటి రాయుడు (1) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. ఆపై ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది.

ఇక చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 24 పరుగులు అవసరం అయ్యాయి. అవేష్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి రుతురాజ్‌ (70; 50 బంతుల్లో 5×4, 2×6) ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ఎంస్ ధోనీ.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడినా అది బ్యాటుకు కనెక్ట్ కాలేదు. ఐదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతి డాట్ అయింది. దీంతో చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 13 పరుగులు కావాల్సి వచ్చింది. గతకొంత కాలంలో అంతగా ఫామ్‌లో లేకపోవడంతో మహీ ఎలా ఆడతాడో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టామ్‌ కరన్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి మొయిన్‌ అలీ (16) ఔటయ్యాడు. దీంతో చెన్నై జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక అభిమానుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

సరిగ్గా ఇక్కడే ఎంఎస్ ధోనీ తనలోని పాత ఫినిషర్‌ను బయటికి తీశాడు. ధనాధన్‌ షాట్లతో మూడు ఫోర్లు సంధించాడు టామ్‌ వేసిన రెండో బంతిని ఎక్స్‌ట్రా కవర్లో ఫోర్‌ బాదిన మహీ.. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడిన తర్వాతి బంతిని కూడా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో కీపర్ వెనకాల బౌండరీ దాటించాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన స్థితికి మారింది. అప్పుడే టామ్‌ వైడ్‌ వేయగా.. మహీ పని మరింత సులువైంది. తర్వాతి బంతిని ధోనీ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో బౌండరీకి తరలించి చెన్నై జట్టును ఫైనల్‌కి చేర్చాడు. ధోనీ ధనాధన్‌ షాట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. మహీ బ్యాటింగుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Story first published: Monday, October 11, 2021, 12:51 [IST]
Other articles published on Oct 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+