మొత్తానికి ప్యాంట్ వేసుకున్నావా ..కార్తీక్? క్రిస్ లిన్ సెటైర్స్!

చెన్నై: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం తన స్వస్థలమైన చెన్నైలో టీకా తీసుకున్నాడు. అతనితో పాటు ఇతర క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్​ చాహర్​​, సిద్ధార్థ్​ కౌల్​, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన‌లు కూడా తమ స్వస్థలాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, ఉమేశ్​ యాదవ్​, ఇషాంత్​ శర్మ, శిఖర్ ధావన్​ కూడా టీకా తొలి డోస్ వేయించుకున్నారు.

టీకా వేయించుకుంటున్న ఫొటోను కార్తీక్ ట్వీట్ చేయగా.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ఫొటోలో కార్తీక్ బ్లాక్ టీషర్ట్, జాగర్స్ ప్యాంట్ ధరించగా.. లిన్ తన మాజీ కెప్టెన్‌ను ట్రోల్ చేశాడు. సరైన ప్యాంట్ వేసుకోవచ్చుగా అనే అర్థం 'మొత్తానికి ప్యాంట్ వేసుకున్నావా?' అని కామెంట్ చేసి కార్తీక్​ను ఆటపట్టించాడు. దినేశ్ కార్తీక్, క్రిస్ లిన్ రెండేళ్ల పాటు కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు.

2018 నుంచి కార్తీక్​ కేకేఆర్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించగా.. అతని సారథ్యంలో రెండేళ్లు ఆడాడు లిన్... ఆ ఏడాదితో పాటు 2019లోనూ నిరాశపర్చాడు. దాంతో కేకేఆర్ అతన్ని వదులుకుంది. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన లిన్ 49 పరుగులతో రాణించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 11, 2021, 21:32 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X