Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: అలా ఆడటం నా వల్ల కానేకాదు.. అది ఎప్పటికీ జరగదు కూడా: పుజారా

IPL 2021: Cheteshwar Pujara says I never play reverse scoop shot like Rishabh Pant
IPL 2021 : Cheteshwar Pujara Feels That He Can Never Play The Reverse Scoop Like Rishabh Pant

ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా ముద్రవేసుకున్న చతేశ్వర్‌ పుజారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో కొన్ని ఐపీఎల్‌ మ్యాచులాడిన పుజారా.. అంతగా రాణించలేకపోయాడు. దీంతో అతణ్ని కొనుగోలు చేయడానికి గత కొన్నేళ్లుగా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే 2021 ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్..‌ పుజారాను అతని కనీస ధర రూ.50 లక్షలకు కొనుగోలుచేసింది. దీంతో టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుని ఐపీఎల్‌-14 సీజన్‌లో రాణించాలని ఎదురుచూస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

రివర్స్‌ స్కూప్‌ ఆడటం నా వల్ల కాదు

రివర్స్‌ స్కూప్‌ ఆడటం నా వల్ల కాదు

ఏప్రిల్‌10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ తుది జట్టులో చతేశ్వర్‌ పుజారాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఆ విషయాన్ని పక్కనపెడితే.. కొన్ని విషయాల్ని పుజారా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'రివర్ప్‌ స్కూప్‌ షాట్ల ఆడటంలో రిషబ్ పంత్‌ ఓ ప్రత్యేకం. పంత్‌ తరహాలో రివర్స్‌ స్కూప్‌ ఆడటం నా వల్ల కానేకాదు. అది ఎప్పటికీ జరగదు కూడా. పంత్‌ ఒక ఫియర్‌లెస్‌ క్రికెటర్‌. అందుకే ఆ షాట్లను ఈజీగా ఆడుతున్నాడు. పంత్‌ ఆడే ఆ షాట్లను నేను ఆడలేను' అని అన్నాడు.

స్కూప్‌ షాట్లను భయంలేకుండా ఆడతా

స్కూప్‌ షాట్లను భయంలేకుండా ఆడతా

'కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ రివర్స్‌ స్కూప్‌ ఆడటం కష్టమనే నేను అనుకుంటా. నేను స్కూప్‌ షాట్లను భయంలేకుండా ఆడతా.. కానీ రివర్స్‌ స్కూప్‌ షాట్లను ఆడను. థర్డ్‌ మ్యాన్‌ పై నుంచి ఆడే ఆ షాట్లతో చాలా రిస్క్‌. ఆ షాట్లు ఆడటంలో రిషబ్ పంత్‌కు అరుదైన టెక్నిక్‌ ఉందనే చెప్పాలి. పదేపదే ఆ షాట్లను ఆడమన్నా.. పంత్‌కు ఆ సత్తా ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు ఆ షాట్లు ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లమంతా షాక్‌ అయ్యాం' అని టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్‌ పుజారా పేర్కొన్నాడు.

కోహ్లీ, రోహిత్‌లను చూసి నేర్చుకుంటా

కోహ్లీ, రోహిత్‌లను చూసి నేర్చుకుంటా

'టీ20 క్రికెట్‌ ఆడేముందు మనలో మానసికంగా మార్పులు చేసుకోవాలి. కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే ఒత్తిడికి గురికావలసిన అవసరం ఉండదు. టెస్టు క్రికెట్‌లో మన వికెట్‌ను కాపాడుకునే క్రమంలో చాలా ఒత్తిడి ఉంటుంది. కాని టీ20 ఫార్మాట్‌లో మనకు ఇష్టమైన అన్ని రకాల షాట్లను ఆడుతూ నిరూపించుకోవాలి. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పుడు నేను కూడా భాగం కావడం సంతోషం. ప్రస్తుతం ఆటగాళ్లు మారారు, వారి నిర్వర్తించాల్సిన బాధ్యతలు మారాయి. నేను పవర్‌ హిట్టర్‌ని కాదు. దానికి అంగీకరిస్తా. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మల నుంచి ఎలా ఆడాలో నేర్చుకుంటా. వారిద్దరూ పూర్తి పవర్‌ హిట్టర్స్‌ కాదు. కాని పొట్టి ఫార్మాట్‌లో వారు అద్భుతంగా రాణిస్తున్నారు' అని పుజారా చెప్పుకొచ్చాడు.

చివరిసారి 2014లో

చివరిసారి 2014లో

చివరిసారి 2014లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన చతేశ్వర్‌ పుజారా.. 2011 నుంచి 2013 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిథ్యం వహించాడు. ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా.. ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్‌నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదేపదే మొత్తుకున్నా.. పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి సీఎస్‌కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో పడ్డాడు. తాజాగా ప్రాక్టీస్‌ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు.

ఐపీఎల్ 2021 ఆడకున్నా.. ఆ భారత ఆటగాడికి పూర్తి జీతం! ఎందుకో తెలుసా?

Story first published: Monday, April 5, 2021, 16:43 [IST]
Other articles published on Apr 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+