Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kedar Jadhav: చెన్నై వద్దనుకున్న దరిద్రం హైదరాబాద్‌కు పట్టుకుంది: మళ్లీ నీకొక డీఆర్ఎస్ వేస్ట్

 IPL 2021: Brian Lara shocked at Kedar Jadhavs review after being given out LBW

అబుధాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్.. మరోసారి సోషల్ మీడియా పాలిట పడ్డాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ టీమ్ అభిమానులు అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. బౌన్సర్లను సంధిస్తున్నారు. ఇప్పటికే- అతను జట్టుకు భారంగా తయారయ్యాడని, మళ్లీ తప్పుడు అంచనాలతో డీఆర్ఎస్ రివ్యూలను సైతం వృధా చేస్తోన్నాడని భగ్గుమంటున్నారు. బంతి ఎక్కడికి దూసుకొస్తోందనే విషయాన్ని కూడా తెలియట్లేదా? అంటూ నిలదీస్తోన్నారతన్ని ఫ్యాన్స్.

బ్యాటింగ్ క్లీన్ బౌల్డ్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 134 పరుగులకు ఆలౌట్ అయింది. అబ్దుల్ సమద్-28, రషీద్ ఖాన్-22 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. వృద్దిమాన్ సాహా, కేప్టెన్ కేన్ విలియమ్సన్ 18 పరుగులు చొప్పన చేశారు. మనీష్ పాండే 17 పరుగులకే పెవిలియన్ చేరాడు.

కేదార్ జాదవ్ ఫెయిల్యూర్స్ కంటిన్యూ

ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ మరోసారి ఘోరంగా విఫలం అయ్యాడు. అతని ఫెయిల్యూర్స్ కొనసాగుతూనే వస్తోన్నాయి. గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడాడతను. దారుణంగా ఆడాడు. గత ఏడాది ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిచ్‌ల మీదే ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన కేదార్ జాదవ్.. చేసింది 62 పరుగులే. అత్యధిక స్కోర్ 26 పరుగులు. బ్యాటింగ్ యావరేజ్ 20.66 పర్సంటేజ్. ఏ మాత్రం సత్తా చాటకపోవడంతో కేదార్ జాదవ్‌ను వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. దీనితో అతని కేరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు.

కేరీర్ క్లోజ్ అయిందనుకున్నదశలో..

ఊహించని విధంగా అతణ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ హైర్ చేసింది. దీనికోసం రెండు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. వరుస వైఫల్యాలను చవి చూస్తూ, ఇక కేరీర్ క్లోజ్ అయిందనుకున్న దశలో ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ. అతని మీద ఎన్నో ఆశలను పెట్టుకుంది. దాని వమ్ము చేశాడతను. అతని బ్యాటింగ్ తీరు గాడిలో పడలేదు. పాత తప్పులను చేస్తూ.. పదే పదే అవుట్ అవుతున్నాడు.

డీఆర్ఎస్ తీసుకోవడంతో

బుధవారం రాత్రి దుబాయ్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేదార్ జాదవ్ భారీ స్కోర్‌ను సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. మూడు పరుగులే చేశాడు. ఎన్ర్రిచ్ నోర్ట్జె బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ అయిదు వికెట్లకు 74 పరుగులు. ఎల్బీగా అవుట్ అయిన తరువాత అతను నేరుగా పెవిలియన్ చేరి ఉంటే బాగుండేది. డీఆర్ఎస్ తీసుకోవడం అతన్ని విమర్శల పాలు చేసింది. క్లియర్ ఎల్బీడబ్ల్యూగా కనిపిస్తోన్నప్పటికీ- అతను డీఆర్ఎస్ తీసుకోవడం పట్ల మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

రివ్యూ వేస్ట్..

మిడిల్ స్టంప్ మీద పడి బంతి నేరుగా బెయిల్స్‌ను ఎగుర వేసేలా దూసుకొచ్చిందనేది నాన్ స్ట్రైకర్ ఎండ్‌ బ్యాట్స్‌మెన్‌కు కూడా తెలిసి ఉండొచ్చని, కేదార్ జాదవ్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడని అంటున్నారు. డీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఓ రివ్యూను అతన వృధా చేశాడని మండిపడుతున్నారు. వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిడిల్ స్టంప్ మీద పడిన బంతి ఎటు వెళ్తుందో కూడా అతను అంచనా వేయలేకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని చెప్పాడు.

Story first published: Thursday, September 23, 2021, 12:11 [IST]
Other articles published on Sep 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+